WhatsApp Web : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వెబ్ వెర్షన్‌లో కాలింగ్ ఫీచర్!

డెస్క్‌టాప్ లేదా లాప్‌టాప్‌లో బ్రౌజర్ ద్వారా వాట్సాప్ వాడే వారికి ఇకపై ఫోన్‌తో పని ఉండదు! బ్రౌజర్ వెర్షన్‌లోనే కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తూ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Feb 11, 2026, 06:03:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వాట్సాప్ వెబ్ వినియోగదారులకు మెటా సంస్థ తీపి కబురు అందించింది. ఇప్పటి వరకు కేవలం మొబైల్ యాప్ లేదా డెస్క్‌టాప్ అప్లికేషన్‌కే పరిమితమైన వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్లను ఇప్పుడు నేరుగా వెబ్ బ్రౌజర్‌లో కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందనుంది.

వాట్సాప్​ వెబ్​లో కొత్త ఫీచర్లు ఇవిగో..
వాట్సాప్​ వెబ్​లో కొత్త ఫీచర్లు ఇవిగో..

వాట్సాప్​ వెబ్​ ఫీచర్​- వన్​ అన్​ వన్​ కాలింగ్..

ప్రస్తుతానికి ఈ అప్‌డేట్ ద్వారా వినియోగదారులు వ్యక్తిగత చాట్‌లలో మాత్రమే వాయిస్, వీడియో కాల్స్ చేసుకోగలరు.

ఎలా వాడాలి: ఏదైనా వ్యక్తిగత చాట్ ఓపెన్ చేసినప్పుడు, పైన కుడి వైపున వాయిస్ అండ్​ వీడియో కాల్ ఐకాన్లు కనిపిస్తాయి.

సాఫ్ట్‌వేర్ అవసరం లేదు: దీని కోసం ప్రత్యేకంగా ఎటువంటి అదనపు సాఫ్ట్‌వేర్ లేదా ఎక్స్‌టెన్షన్లు ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా బ్రౌజర్ (క్రోమ్​, ఫైర్​ఫాక్స్​, సాఫారీ మొదలైనవి) నుంచే కాల్స్ మాట్లాడవచ్చు.

వాట్సాప్​ వెబ్​ ఫీచర్​- వీడియో కాల్‌లో స్క్రీన్ షేరింగ్..

వాట్సాప్​ వెబ్​లో ఇక కేవలం కాల్స్ మాత్రమే కాకుండా, వీడియో కాల్ సమయంలో మీ కంప్యూటర్ స్క్రీన్‌ను షేర్ చేసే సదుపాయాన్ని కూడా సంస్థ కల్పించింది. ఇది ముఖ్యంగా ఆఫీస్ మీటింగులు, ప్రెజెంటేషన్లు లేదా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

వాట్సాప్​ వెబ్​ ఫీచర్​- భద్రతకు పెద్దపీట..

వెబ్ బ్రౌజర్ ద్వారా కాల్స్ చేసినప్పటికీ, భద్రత విషయంలో వాట్సాప్ ఎక్కడా తగ్గలేదు!

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్: మొబైల్ యాప్‌లో లాగానే వెబ్ కాల్స్ కూడా పూర్తిగా ఎన్‌క్రిప్ట్ చేసి ఉంటాయి.

మీ సంభాషణలను మూడొవ వ్యక్తి లేదా మెటా సంస్థ కూడా వినడానికి, చూడటానికి వీలుండదు.

గమనిక: ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం ‘వాట్సాప్ వెబ్ బీటా’ ప్రోగ్రామ్‌లో ఉన్న వారికి మాత్రమే కనిపిస్తోంది. రాబోయే కొద్ది వారాల్లో సాధారణ వినియోగదారులందరికీ ఇది అందుబాటులోకి రానుంది.

మీ కొత్త వాట్సాప్​ వెబ్​ ఫీచర్స్​ని పొందడకం కోసం హెల్ప్​-అండ్​ ఫీడ్​బ్యాక్​ సెక్షన్​లోని సెట్టింగ్స్​కి వెళ్లి బీటా ప్రోగ్రామ్​లో చేరవచ్చు. అయితే, చేరినప్పటికీ మీకు వెంటనే యాక్సిస్​ లభిస్తుందని కచ్చితంగా చెప్పడానికి లేదు.

వాట్సాప్​ వెబ్​- త్వరలో మరిన్ని ఫీచర్లు..

ప్రస్తుతం గ్రూప్ కాలింగ్ సదుపాయం లేనప్పటికీ, భవిష్యత్తులో 32 మంది వరకు ఒకేసారి గ్రూప్ కాల్ మాట్లాడుకునే ఫీచర్‌ను తీసుకురావడానికి వాట్సాప్ కసరత్తు చేస్తోంది. దీనితో పాటు కాల్ లింక్స్, షెడ్యూల్డ్ కాల్స్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా రానున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More