Instants : మెటా నుంచి కొత్త యాప్​.. స్నాప్​చాట్​కి పోటీగా ‘ఇన్​స్టంట్స్​’- ఆ ఫీచర్​తో!

సోషల్ మీడియా దిగ్గజం మెటా, స్నాప్‌చాట్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 'ఇన్‌స్టంట్స్' పేరుతో ఒక స్వతంత్ర యాప్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. డిసప్పియర్​ ఫోటోలు, వీడియోలే దీని ప్రధాన ఆకర్షణ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 10, 2026, 11:20:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్మాప్​చాట్​కి గట్టి పోటీని ఇచ్చే విధంగా ప్రముఖ సోషల్​ మీడియా దిగ్గజం మెటా.. కొత్త యాప్​ని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. దాని పేరు “ఇన్​స్టంట్స్”. వినియోగదారులు పంపిన ఫోటోలు, వీడియోలు చూసిన వెంటనే మాయమైపోయేలా (డిసప్పియర్​) ఈ ఇన్‌స్టాంట్స్ యాప్‌ని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం..

మెటా నుంచి కొత్త యాప్​, ఇన్​స్టాగ్రామ్​లో కొత్త ఫీచర్​..
మెటా నుంచి కొత్త యాప్​, ఇన్​స్టాగ్రామ్​లో కొత్త ఫీచర్​..

స్నాప్‌చాట్‌కు అసలైన పోటీ..

ఓ ప్రముఖ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. మెటా ప్రస్తుతం ఈ ఇన్​స్టంట్స్​ యాప్‌కి సంబంధించిన అంతర్గత ప్రోటోటైప్‌పై పనిచేస్తోంది. ఫోటోలు పంపిన తర్వాత అవి ఆటోమేటిక్‌గా అదృశ్యమయ్యేలా దీనిని రూపొందిస్తున్నారు. అయితే, ఈ యాప్ ప్రస్తుతం అంతర్గతంగా అభివృద్ధి దశలోనే ఉందని, ఇంకా ఎక్స్​టర్నల్​ టెస్టింగ్​ కోసం అందుబాటులోకి రాలేదని మెటా ప్రతినిధి స్పష్టం చేశారు.

దీని బట్టి చూస్తే, ఈ యాప్​ సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పడుతుందని అర్థం చేసుకోవచ్చు.

యాప్ రివర్స్ ఇంజనీరింగ్ నిపుణుడు అలెశాండ్రో పలుజ్జి ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘Also from Meta’ పేజీలో ఈ 'ఇన్‌స్టాంట్స్' ప్రస్తావన కనిపించింది. స్నేహితులతో ఇన్​స్టంట్​ ఫోటోలను పంచుకోవడానికి ఇది ఒక కొత్త మార్గంగా అక్కడ పేర్కొన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 'ఇన్‌స్టంట్స్' ఫీచర్!

అయితే కొత్త యాప్​తో పాటు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో కూడా ఈ 'ఇన్‌స్టంట్స్' పేరుతో ఒక కొత్త ఫీచర్‌ను మెటా పరీక్షిస్తోంది.

దీనిని గతంలో ‘షాట్స్’ అని పిలిచేవారు.

ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో పరిమితంగా టెస్టింగ్​ దశలో ఉంది.

ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజెస్ (డీఎం)లో అదృశ్యమయ్యే మీడియాను పంపవచ్చు.

పంపిన ఫోటోను అవతలి వారు ఓపెన్ చేసిన వెంటనే లేదా పంపిన 24 గంటల తర్వాత అది ఎక్స్‌పైర్ అయిపోతుంది.

ఇన్‌స్టాగ్రామ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ 'ఇన్‌స్టంట్స్' ఫీచర్ ద్వారా కేవలం మీరు ఫాలో అవుతూ, మిమ్మల్ని తిరిగి ఫాలో అయ్యే వారికి మాత్రమే మెసేజ్‌లు పంపగలరు. అలాగే, ఈ మీడియాను ఎడిట్ చేసే అవకాశం ఉండదు.

రానున్న రోజుల్లో ఈ ఇన్​స్టంట్స్​, ఇన్​స్టాగ్రామ్​ ఇన్​స్టంట్స్​ ఫీచర్​పై మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయ.

మెటా వ్యూహం ఇదేనా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ‘వ్యూ వన్స్’, ‘వానిష్ మోడ్’ వంటి డిసప్పియరింగ్​ మెసేజెస్​ ఫీచర్లు ఉన్నప్పటికీ.. స్నాప్‌చాట్ తరహాలో యూజర్లను మరింతగా ఆకట్టుకోవడానికి మెటా ఈ ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. స్నాప్‌చాట్​కు వినియోగదారులు పెరగకుండా అడ్డుకోవడమే మెటా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని టెక్​ నిపుణులు చెబుతున్నారు.

అయితే, ఏదైనా కొత్తగా చేసే క్రమంలో ఇన్​స్టాగ్రామ్​ ఎప్పుడూ తన ప్రత్యర్థి స్నాప్​చాట్​ని ఇమిటేట్​ చేస్తోందని విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో స్నాప్​చాట్​లో సక్సెస్​ అయిన ఫీచర్​ని ఇన్​స్టాగ్రామ్​ తీసుకుని, దానికి “స్టోరీస్​” అని పేరు పెట్టింది. గతేడాది.. సోషల్​ మ్యాప్​ పేరుతో ఇన్​స్టాగ్రామ్​ ఒక ఫీచర్​ని తీసుకొచ్చింది. ఇదే ఫీచర్​.. స్నాప్​చాట్​లో 'స్నాప్​ మ్యాప్​' పేరుతో అప్పటికే అందుబాటులో ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More