AP Inter Hall Ticket 2026 : ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల - ఈ డైరెక్ట్ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి
ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://bie.ap.gov.in/ వెబ్ సైట్ లేదా మనమిత్ర వాట్సాప్ (9552300009) ద్వారా వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు వచ్చేశాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ షురూ అవుతాయి. మార్చి 24వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తి కానున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల మధ్య నిర్వహిస్తారు.

ఏపీ ఇంటర్ హాల్‌టికెట్లు - డౌన్లోడ్ ప్రాసెస్
ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులు https://bie.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి లేదా మనమిత్ర వాట్సాప్ (9552300009) ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సులభంగా వీటిని పొందే అవకాశం ఉంది.
ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పదో తరగతి హాల్ టికెట్ నంబరు, ద్వితీయ సంవత్సరం వారు మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబరు లేదా ఆధార్ నంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక హాల్ టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్, కళాశాల స్టాంప్ అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.
- ముందుగా https://bie.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఐపీఈ హాల్ టికెట్ లింక్ క్లిక్ చేయాలి.
- సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ లేదా ఆధార్ నెంబర్ వివరాలను నమోదు చేయాలి.
- ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అయితే టెన్త్ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- డౌన్లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందవచ్చు.
మనమిత్ర వాట్సాప్ నెంబర్ నుంచి ఇలా…
ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా ఈ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా 9552300009 వాట్సప్ నంబర్‌కు Hi అని మెసేజ్ సెండ్ చేయాలి. ‘ఎడ్యుకేషన్ సర్వీసెస్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.ఇక్కడ మీ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
ఏపీ ఇంటర్ 2026 - ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ షెడ్యూల్ :
- ఫిబ్రవరి 23 - ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1.
- ఫిబ్రవరి 25 - ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 1.
- ఫిబ్రవరి 27 - ఫస్ట్ ఇయర్ హిస్టరీ పేపర్ 1, బోటనీ పేపర్ 1.
- మార్చి 2 - ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 1, పేపర్ 1ఏ.
- మార్చి 5 - ఫస్ట్ ఇయర్ జూవాలజీ/ మ్యాథ్స్ 1బి, జూవాలజీ పేపర్ 1.
- మార్చి 7 - ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ 1.
- మార్చి 10- ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ 1.
- మార్చి 12 - ఫస్ట్ ఇయర్ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 1.
- మార్చి 14- ఫస్ట్ ఇయర్ సివిక్స్ 1.
- మార్చి 17 - ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ 1.
- మార్చి 21 - ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1.
- మార్చి 24 - ఫస్ట్ ఇయర్ మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 1.
ఏపీ ఇంటర్ 2026 - సెకండ్ ఇయర్ ఎగ్జామ్ షెడ్యూల్ :
- ఫిబ్రవరి 24 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2.
- ఫిబ్రవరి 26 - ఇంగ్లీషు పేపర్ 2.
- ఫిబ్రవరి 28 - సెకండ్ ఇయర్ హిస్టరీ/ బోటనీ పేపర్ 2.
- మార్చి 4 - సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2ఏ/ సివిక్స్ 2.
- మార్చి 6 - సెకండ్ ఇయర్ జూవాలజీ 2/ ఎకనామిక్స్ 2.
- మార్చి 9- సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2బి.
- మార్చి 11- సెకండ్ ఇయర్ ఫిజిక్స్/ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 2.
- మార్చి 13- సెకండ్ ఇయర్ ఫిజిక్స్ 2.
- మార్చి 16 - సెకండ్ ఇయర్ మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 2.
- మార్చి 18 - సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ 2.
- మార్చి 23 - సెకండ్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ -2.

E-Paper












