AP Inter Results 2026 : ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్ - మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి

AP Inter 1st Year 2nd Year Results 2026 : ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లతో పాటు వాట్సాప్ ద్వారా సులభంగా చూసుకోవచ్చు. 

Published on: Apr 15, 2026 10:34 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Inter Results 2026 : విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు వచ్చేశాయ్. ఇవాళ ఉదయం 10:31 గంటలకు ఫలితాలను వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

ఏపీ ఇంటర్ ఫలితాలు (image istock)
ఏపీ ఇంటర్ ఫలితాలు (image istock)

ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలు రికార్డు స్థాయి ఫలితాలను సాధించాయి.

  • ప్రథమ సంవత్సరం: ప్రభుత్వ కళాశాలల్లో 54 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇది గత 12 ఏళ్లలో ఇదే అత్యధికం.
  • ద్వితీయ సంవత్సరం: 68 శాతం ఉత్తీర్ణత సాధించి… గత 12 ఏళ్లలో రెండో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాయి.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులు మునుపెన్నడూ లేని విధంగా అద్భుత ప్రతిభ కనబరిచారు. గత 12 ఏళ్లలో లేనంతగా ప్రథమ సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

ఏపీ ఇంటర్ ఫలితాలు - ఎలా చెక్ చేసుకోవాలంటే..?

ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ మొదటి సంవత్సరం లేదా రెండో సంవత్సరం రిజల్ట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం విద్యార్థికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ నమోదు చేస్తే రిజల్ట్స్ డిస్ ప్లే అవుతాయి.

  • resultsbie.ap.gov.in
  • bie.ap.gov.in
  • results.apcfss.in

వాట్సాప్ లో ఇంటర్ ఫలితాలు…

  • ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మన మిత్ర' (Mana Mitra) వాట్సాప్ సేవల ద్వారా కూడా ఇంటర్ ఫలితాలు తెలుసుకోవచ్చు.
  • మొబైల్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్ చేయండి.
  • వాట్సాప్‌లో ఈ నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపండి.
  • మెనూలో 'Education Services' ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • ఆ తర్వాత 'Download Intermediate Results' పై క్లిక్ చేసి, మీ హాల్ టికెట్ నంబర్ ఇస్తే చాలు. మీ మార్కుల మెమో డిస్ ప్లే అవుతుంది.

ఫలితాల్లో ఆశించిన ఫలితం రాని విద్యార్థులు ఏమాత్రం కుంగిపోవద్దని విద్యావేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. "ఫలితాల్లో విఫలమైన విద్యార్థులు అధైర్యపడకండి. దీనిని ఒక అడ్డంకిగా కాకుండా… భవిష్యత్తులో మరింత బలంగా తిరిగి రావడానికి ఒక ప్రేరణగా తీసుకోండి" అని భరోసా ఇస్తున్నారు. ఈ సున్నితమైన సమయంలో తల్లిదండ్రులు, కళాశాలలు విద్యార్థులకు నైతిక మద్దతుగా నిలవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More