AP Inter Supplementary Exams : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారు - రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఎప్పుడంటే..?
AP Inter Supplementary Exam Dates 2026 : ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల కావటంతో… అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు తేదీలు వచ్చేశాయి. మే 21 నుంచి జూన్ 4 వరకు జరుగనున్నాయి.
AP Inter Supplementary Exam Dates 2026 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల కాగా…ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. అంతేకాకుండా పాస్ అయి కూడా ఆశించిన మార్కులు రాని వారికి 'ఇంప్రూవ్‌మెంట్' అవకాశం ఉంటుంది.

ఇంటర్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఇక ప్రాక్టికల్స్ పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభమై… జూన్ 11 వరకు ఉంటాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంటుంది.
ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 5న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 6న నిర్వహిస్తారు. అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చు.సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ కళాశాలల్లో పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ తేదీలు…
ఇంటర్ మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థులు మళ్లీ మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తులను స్వీకరిస్తారు.
- దరఖాస్తు గడువు : ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- రీకౌంటింగ్ (RC): మార్కులు సరిగ్గా లెక్కించారో లేదో తెలుసుకోవడానికి దీనిని ఎంచుకోవచ్చు.
- రీవెరిఫికేషన్ (RV): ఇందులో జవాబు పత్రాల స్కాన్ కాపీని విద్యార్థికి పంపిస్తారు. మొత్తం పేపర్‌ను మరోసారి పరిశీలిస్తారు.
- ఎగ్జామ్ పేపర్లు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కావాలనుకునే విద్యార్థులు ఈ తేదీల్లోగా తమ దరఖాస్తులను తప్పనిసరిగా సమర్పించుకోవాల్సి ఉంటుంది.
ఇవాళ ఉదయం 10:31 గంటలకు ఇంటర్ ఫలితాలను వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.ఈ ఫలితాల్లో విద్యార్థులు మునుపెన్నడూ లేని విధంగా అద్భుత ప్రతిభ కనబరిచారు. గత 12 ఏళ్లలో లేనంతగా ప్రథమ సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
ఫలితాల కోసం ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ మొదటి సంవత్సరం లేదా రెండో సంవత్సరం రిజల్ట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం విద్యార్థికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ నమోదు చేస్తే రిజల్ట్స్ డిస్ ప్లే అవుతాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

