ఏపీ వ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) 6 నుంచి 11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు కల్పించటంతో పాటు 7, 8, 9, 10, 12వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను కూడా భర్తీ చేస్తారు.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 10వ తేదీనే పూర్తి అయింది. అయితే ఈ తేదీని ఏప్రిల్ 20వ తేదీ వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అర్హులైన విద్యార్థులు…. ఈ తేదీ వరకు అప్లికేషన్ చేసుకునే వీలుంటుంది. ఆరో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థి 5వ తరగతిలో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ సీటు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి.. టెన్త్ పాసై ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వర్గాలకు చెందిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు.
- అడ్మిషన్ల కోసం కేవలం ఆన్‌లైన్ దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
- 6వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం (11వ తరగతి)లో కొత్త ప్రవేశాలుంటాయి. అలాగే 7 నుంచి 10 మరియు 12వ తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు.
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేజీబీవీల్లో మొత్తం 32,079 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్లు, అలాగే ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ (BPL) వర్గాల బాలికలకు ఈ పాఠశాలల్లో ప్రాధాన్యత ఉంటుంది.
- అధికారిక వెబ్‌సైట్ apkgbv.apcfss.in ద్వారా అప్లికేషన్ సమర్పించవచ్చు.
- ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆయా పాఠశాలల నోటీసు బోర్డుల్లో ఉంచడంతో పాటు, ఎంపికైన వారికి ఎస్ఎంఎస్ (SMS) ద్వారా సమాచారం అందిస్తారు.
- ఏవైనా సందేహాలు ఉంటే, విద్యార్థులు, తల్లిదండ్రులు పని వేళల్లో (ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు) 7993329115, 7075039990 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
AP KGBV దరఖాస్తు విధానం ఇలా:
- ముందుగా https://apkgbv.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఆరో తరగతి రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- అభ్యర్థి పేరు, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
- చివరగా ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా దరఖాస్తు రిజిస్ట్రేషన్ కాపీని పొందొచ్చు.
పైన పేర్కొన్న మాదిరిగానే ఇతర తరగతుల్లో ప్రవేశాలకు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరలాతో పాటు అడ్మిషన్లకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకునేందుకు https://apkgbv.apcfss.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
{{/usCountry}}పైన పేర్కొన్న మాదిరిగానే ఇతర తరగతుల్లో ప్రవేశాలకు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరలాతో పాటు అడ్మిషన్లకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకునేందుకు https://apkgbv.apcfss.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
{{/usCountry}}