AP KGBV Admissions 2026 : కేజీబీవీల్లో అడ్మిషన్లు - ఈనెల 12 నుంచి దరఖాస్తులు ప్రారంభం

AP Kasturba Gandhi Balika Vidyalayas : ఏపీలోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల  12 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Published on: Mar 05, 2026 2:59 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా మార్చి 12వ తేదీ నుంచి అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు.

కస్తూర్భాగాంధీ ప్రవేశాలు
కస్తూర్భాగాంధీ ప్రవేశాలు

ముఖ్యమైన వివరాలు…

నోటిఫికేషన్ లో భాగంగా ఆరో తరగతితో పాటు ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు కల్పిస్తారు. అంతేకాకుండా 7 నుంచి పదో తరగతి వరకు ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి ఏప్రిల్‌ 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఆరో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థి… 5వ తరగతిలో తప్పనిసరిగా ఉత్తీర్ణుడై ఉండాలి. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ సీటు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి… టెన్త్ పాసై ఉండాలి. ప్రస్తుతం టెన్త్ ఎగ్జామ్స్ రాసే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇక రాష్ట్రంలో 352 కేజీబీవీలు ఉన్నాయి. అర్హత ఉన్న విద్యార్థులకు 2026 - 27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు కల్పిస్తారు. 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించరు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరగణిస్తారు. https://apkgbv.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది. సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో కూడా పేర్లను నేరుగా చూడవచ్చు.

కేజీబీవీల్లో సీట్ల కోసం ఎంపికైన విద్యార్థుల జాబితా ఏప్రిల్‌ 13వ తేదీన విడుదల చేస్తారు. ఏప్రిల్ 13 నుంచి 17వ తేదీ వరకు ఆయా విద్యాలయాల్లో విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. ఆ తర్వాత సీటును కన్ఫార్మ్ చేస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More