AP PECET 2026 : ఏపీ పీఈసెట్ నోటిఫికేషన్ - దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం, పరీక్షలు ఎప్పుడంటే..?
ఏపీ పీఈసెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మే 3వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి
రాష్ట్రంలోని యూనివర్శిటీలు, అనుబంధ కాలేజీల్లోని బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించి ఏపీ పీఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

ఏపీ పీఈసెట్ (APPECET-2026) నోటిఫికేషన్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి గాను బి.పి.ఎడ్ (B.P.Ed), డి.పి.ఎడ్ (D.P.Ed) కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఫైన్ లేకుండా ఏప్రిల్ 30వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక రూ. 1000 ఫైన్ తో మే 15వ తేదీ వరకు, రూ. 2 వేల ఆలస్య రుసుంతో అయితే మే 25వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
బీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డి.పి.ఎడ్ కు అయితే ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అప్లికేషన్ ఫీజు కింద ఓసీ అభ్యర్థులకు రూ.900, బీసీలకు రూ.800, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.700 చెల్లించాలి.
ఏపీ పీఈసెట్ అప్లికేషన్ ప్రాసెస్…
- అభ్యర్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని ఫీజు పేమెంట్ లింక్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
- ఆ తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫారమ్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ విద్యా అర్హత వివరాలతో పాటు ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- చివరగా సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందొచ్చు.
- రిజిస్ట్రేషన్ నెంబర్ సాయంతో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపీ పీఈసెట్ (APPECET-2026) ప్రవేశ పరీక్షలను ఈ ఏడాది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఆన్ లైన్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ మే 24 - 25 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. మే 28వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 3వ తేదీ నుంచి ఫిజికల్ మరియు స్కిల్ టెస్టులు నిర్వహిస్తారు. జూన్ 8వ తేదీ వరకు వీటిని నిర్వహిస్తారు. ఉదయం 7 గంటలకే ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలను ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ప్రాంగణంలో నిర్వహిస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

