...
...
Next Story

AP LAWCET 2026 Counselling : ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - వెబ్ ఆప్షన్లు ప్రారంభం

AP LAWCET 2026 Counselling : ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ విద్య ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్ సెట్ 2026 వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభమైంది. అక్టోబర్ 2 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంది.

Published on: Sep 30, 2026, 08:42:40 IST
Advertisement

AP LAWCET 2026 Counselling : ఏపీ లాసెట్ - 2026 అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఇప్పటికే కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ముగియగా… తాజాగా వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి.నిర్దేశించిన సమయంలోపు తమ ఐచ్ఛికాలను నమోదు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు షెడ్యూల్

ఏపీ లాసెట్ 2026 కౌన్సెలింగ్
ఏపీ లాసెట్ 2026 కౌన్సెలింగ్

అర్హత సాధించిన అభ్యర్థులు అక్టోబర్ 02, 2026 వరకు తమకు ప్రాధాన్యత ఉన్న కళాశాలలను వెబ్ ఆప్షన్లుగా నమోదు చేసుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. ఇప్పటికే నమోదు చేసుకున్న ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేయాలనుకునే విద్యార్థుల కోసం అక్టోబర్ 03, 2026న ఎడిట్ విండోను అందుబాటులో ఉంచుతారు.

అభ్యర్థులు సాధించిన మెరిట్ మార్కులు, ర్యాంకుతో పాటు రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా అక్టోబర్ 06, 2026న సీట్ల కేటాయింపు ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు కౌన్సెలింగ్ మరియు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కోసం అధికారిక పోర్టల్ https://cap.apcfss.in/ ను సందర్శించాల్సి ఉంటుంది.

కళాశాలల్లో రిపోర్టింగ్, తరగతుల ప్రారంభం

సీట్లు పొందిన అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో అక్టోబర్ 07, 2026 నుండి అక్టోబర్ 09, 2026 మధ్య నేరుగా హాజరై సర్టిఫికేట్లు సమర్పించి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు, అక్టోబర్ 07, 2026 నుంచే నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులు కూడా ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లాసెట్ పరీక్షకు మొత్తం 23,996 మంది విద్యార్థులు హాజరుకాగా… వారిలో 19,197 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ పరీక్షను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించింది. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరూ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ మరియు వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో పాల్గొనవచ్చు. అయితే రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారు మాత్రమే… వెబ్ ఆప్షన్లు ఎంచుకునేందుకు అర్హులవుతారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks