AP LAWCET 2026 Counselling : ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - రిజిస్ట్రేషన్లు ప్రారంభం, ముఖ్య తేదీలివే
AP LAWCET 2026 Counselling : ఏపీ లాసెట్ (AP LAWCET/PGLCET) మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అక్టోబర్ 6వ తేదీన సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేస్తారు.
AP LAWCET 2026 Counselling : రాష్ట్రంలో న్యాయ విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఏపీ లాసెట్, పీజీఎల్ సెట్ (AP LAWCET/AP PGLCET - 2026) మొదటి విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.

ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ - ముఖ్య తేదీలు :
కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా విద్యార్థుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 24, 2026 నుంచి ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు సెప్టెంబర్ 29, 2026 వరకు వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు
- సర్టిఫికెట్ల ఆన్‌లైన్ పరిశీలన : అక్టోబర్ 02, 2026 వరకు కొనసాగుతుంది.
- స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల పరిశీలన: ప్రత్యేక కేటగిరీ కిందకు వచ్చే అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనను సెప్టెంబర్ 28, 2026న నిర్వహించనున్నారు.
- సెప్టెంబర్ 29, 2026 నుండి అక్టోబర్ 02, 2026 వరకు విద్యార్థులు తమ ఐచ్ఛికాలను నమోదు చేసుకోవచ్చు.
- నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేయాలనుకుంటే అక్టోబర్ 03, 2026న అవకాశం కల్పిస్తారు.
- అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా అక్టోబర్ 06, 2026న సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://cap.apcfss.in/
సీట్లు పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో అక్టోబర్ 07, 2026 నుండి అక్టోబర్ 09, 2026 మధ్య నివేదించాల్సి ఉంటుంది. అదే రోజున అనగా అక్టోబర్ 07, 2026 నుంచే కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులు కూడా ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. న్యాయ విద్య ప్రవేశాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://cap.apcfss.in/ ద్వారా సమయానికి నమోదు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా 23,996 మంది విద్యార్థులు లాసెట్ పరీక్ష రాశారు. 19,197మంది అర్హత సాధించారు. ఈ ఏడాది లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించింది. అర్హత పొందిన వారంతా కూడా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.
ఏపీ లాసెట్ ర్యాంక్ కార్డు డౌన్లోడ్ ఇలా…
- మొదట అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in ను సందర్శించండి.
- హోమ్‌పేజీలో కనిపించే 'AP LAWCET - 2026 Results' లేదా 'Rank Card' లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, లాసెట్ హాల్ టికెట్ నంబర్ వివరాలను నమోదు చేయండి.
- స్క్రీన్‌పై మీ ఫలితాలు ప్రత్యక్షమవుతాయి. భవిష్యత్తు అవసరాల కోసం ర్యాంక్ కార్డును ప్రింట్ తీసి ఉంచుకోండి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

