...
...
Next Story

AP Local Body Elections Schedule : 23 పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

AP Local Body Elections Schedule : ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థలు, 3 విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ అనీల్ చంద్ర పునేఠా షెడ్యూల్ విడుదల చేశారు. నవంబర్ 26న పోలింగ్, 30న కౌంటింగ్ జరగనుంది.

Published on: Nov 12, 2026, 14:38:10 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. పెండింగ్‌లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడలోని కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనీల్ చంద్ర పునేఠా ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు.ఈ నెల 26వ తేదీన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటే 23 పట్టణ స్థానిక సంస్థలకు కూడా పోలింగ్ నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

నవంబర్ 13న గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్, నవంబర్ 16న రెండో విడత, నవంబర్ 19న మూడో విడత పంచాయతీ నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. నవంబర్ 19న ఎంపీపీ, నవంబర్ 20న జెడ్పీపీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.

తొలి విడత పంచాయతీ ఓట్ల లెక్కింపును నవంబర్ 26నే చేపడతారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల నవంబర్ 29న వెల్లడిస్తారు. డిసెంబర్ 2న మూడో విడత పంచాయతీ ఓట్ల లెక్కింపు చేస్తారు. నవంబర్ 30న పట్టణ స్థానిక సంస్థల కౌంటింగ్ జరగనుంది. ఇక డిసెంబర్ 3న పట్టణ స్థానిక సంస్థలకు పరోక్ష ఎన్నికల (మేయర్/ఛైర్‌పర్సన్) నిర్వహస్తారు.

సాంకేతిక, న్యాయపరమైన కారణాలతో గతంలో నిలిచిపోయిన 23 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రాజకీయం వేడెక్కింది. నవంబర్ 26న పోలింగ్ ముగిసిన తర్వాత, 30న ఓట్లను లెక్కిస్తారు. అనంతరం డిసెంబర్ 3న ఆయా సంస్థలకు మేయర్, ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్ల ఎంపిక కోసం పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మూడు విడతలను ఎంచుకుంది. నవంబర్ 13న తొలి విడత నోటిఫికేషన్‌తో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks