దసరా, దీపావళి వేళ ప్రయాణికులకు అప్డేట్... చర్లపల్లి - శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు! తేదీలు, హాల్టింగ్ లిస్ట్ ఇదే

South Central Railway Festival Trains : పండుగల రద్దీ దృష్ట్యా చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ మధ్య నడిచే వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లు… తెలుగు రాష్ట్రాల్లోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి.

Published on: Sep 19, 2026, 16:45:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

South Central Railway Festival Trains : రాబోయే దసరా, దీపావళి, పూజా పండుగల సమయాల్లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని అదుపు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని చర్లపల్లి మరియు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - ప్రత్యేక రైళ్లు పొడిగింపు
రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - ప్రత్యేక రైళ్లు పొడిగింపు

పండుగ సీజన్‌లో ఇరు మార్గాల్లో చెరో 8 ట్రిప్పుల చొప్పున మొత్తం 16 సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు. అక్టోబర్ 6, 2026 నుంచి నవంబర్ 25, 2026 వరకు ఈ ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి.

రైళ్ల షెడ్యూల్ - సర్వీసు తేదీలు :

  • రైలు నంబర్ 07037 (చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్): ఈ రైలు ప్రతి వారం మంగళవారం రోజున చార్లపల్లి నుంచి బయలుదేరుతుంది. అక్టోబర్ నెలలో 6, 13, 20, 27 తేదీలలో, అలాగే నవంబర్ నెలలో 3, 10, 17, 24 తేదీలలో మొత్తం 8 సర్వీసులు నడుస్తాయి.
  • రైలు నంబర్ 07038 (శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి ): తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి వారం బుధవారం రోజున శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. అక్టోబర్ నెలలో 7, 14, 21, 28 తేదీలలో, అలాగే నవంబర్ నెలలో 4, 11, 18, 25 తేదీలలో మొత్తం 8 ట్రిప్పులు అందుబాటులో ఉంటాయి.

రెండు వైపులా ప్రయాణించే ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన రైల్వే జంక్షన్లలో ఆగుతాయి. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, కొత్తవలస, విజయనగరం మరియు చిపురుపల్లి స్టేషన్లలో స్టాప్‌లు కల్పించారు.

ప్రయాణికుల విభిన్న అవసరాలకు తగినట్లుగా ఈ రైళ్లలో ఏసీ II టైర్, ఏసీ III టైర్, స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. పండుగ సమయంలో సాధారణ రైళ్లలో నిరీక్షణ జాబితా (వైటింగ్ లిస్ట్) ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు ముందస్తుగానే రిజర్వేషన్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More