charlapalli-patna train : చర్లపల్లి-పాట్నా స్పెషల్ ట్రైన్స్ పొడిగింపు.. డిసెంబర్ దాకా
charlapalli-patna trains : ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి-పాట్నా స్పెషల్ ట్రైన్స్ సర్వీసులను పొడిగిస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో ఈ రూట్‌లో ప్రయాణించేవారికి ఉపశమనం దొరికినట్టైంది.
చర్లపల్లి-పాట్నా మధ్య నడిచే రైళ్లలో ఎక్కువ సంఖ్యలో జనాలు ప్రయాణిస్తుంటారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే స్పెషల్ ట్రైన్స్ నడుపుతుండగా.. తాజాగా వాటిని పొడిగిస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో మెుత్తం 41 సర్వీసులు నడవనున్నాయి.

ట్రైన్ నెంబర్ 03253 పాట్నా – చర్లపల్లి సోమ, బుధవారాల్లో నడుస్తుంది. 21.09.2026 నుండి 30.11.2026 వరకు మెుత్తం 21 సర్వీసులు ఉంటాయి.
ట్రైన్ నెంబర్ 03254 చర్లపల్లి – పాట్నా ప్రతీ బుధవారంలో ఉంటుంది. 23.09.2026 నుండి 02.12.2026 వరకు 11 సర్వీసులు నడపనున్నారు.
రైలు నెంబర్ 03255 చర్లపల్లి – పాట్నా ప్రతీ శుక్రవారం 25.09.2026 నుండి 27.11.2026 వరకు నడుస్తుంది. మెుత్తం 10 సర్వీసులు ప్లాన్ చేశారు.
ఈ రైళ్లు ఖాజీపేట్, పెద్దపల్లి, సిర్పూర్-కాగజ్‌నగర్, బలార్ష, నాగ్‌పూర్, గోండియ, దుర్గ్, రాయ్‌పూర్, బిలాసపూర్, ఝర్సుగూడ, రూర్‌కెలా, హాతియా, రాంచి, బొకారో, గోమోహ్, పరసంత్, కోడెర్మ, గయ, జెహానాబాద్, తెరెగ్నలో ఇరువైపులా ఆగుతాయి.
పొడిగించిన మరికొన్ని రైళ్లు
దసరా, దీపావళి పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు నడిచే పలు వారపు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 98 సర్వీసులను నవంబర్ 2026 చివరి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ - నహర్లాగన్ (ట్రైన్ నం. 07046) : ప్రతి శుక్రవారం నడిచే ఈ రైలును అక్టోబర్ 2, 2026 నుంచి అక్టోబర్ 30, 2026 వరకు (5 సర్వీసులు) పొడిగించారు.
నహర్లాగన్ - సికింద్రాబాద్ (ట్రైన్ నం. 07047 ): ప్రతి సోమవారం నడిచే ఈ సర్వీసు అక్టోబర్ 5, 2026 నుంచి నవంబర్ 2, 2026 వరకు (5 సర్వీసులు) అందుబాటులో ఉంటుంది.
హైదరాబాద్ - కొల్లాం (ట్రైన్ నం. 07193) : ప్రతి శనివారం నడిచే ఈ రైలును అక్టోబర్ 3, 2026 నుంచి నవంబర్ 28, 2026 వరకు (9 సర్వీసులు) అందుబాటులో ఉంచారు.
కొల్లాం - హైదరాబాద్ (ట్రైన్ నం. 07194) : ప్రతి సోమవారం నడిచే ఈ రైలు అక్టోబర్ 5, 2026 నుంచి నవంబర్ 30, 2026 వరకు (9 సర్వీసులు) నడుస్తుంది.
సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ (ట్రైన్ నం. 07425) : ప్రతి ఆదివారం నడిచే ఈ సర్వీసును అక్టోబర్ 4, 2026 నుంచి నవంబర్ 29, 2026 వరకు (9 సర్వీసులు) పొడిగించారు.
శ్రీకాకుళం రోడ్ - సికింద్రాబాద్ (ట్రైన్ నం. 07426) : ప్రతి సోమవారం నడిచే ఈ రైలు అక్టోబర్ 5, 2026 నుంచి నవంబర్ 30, 2026 వరకు (9 సర్వీసులు) నడుస్తుంది.
చర్లపల్లి - తిరువణ్ణామలై(అరుణాచలం) (ట్రైన్ నం. 07001) : ప్రతి గురువారం నడిచే ఈ రైలు అక్టోబర్ 1, 2026 నుంచి నవంబర్ 26, 2026 వరకు (9 సర్వీసులు) అందుబాటులో ఉంటుంది.
తిరువణ్ణామలై - చర్లపల్లి (ట్రైన్ నం. 07002) : ప్రతి శుక్రవారం నడిచే ఈ సర్వీసు అక్టోబర్ 2, 2026 నుంచి నవంబర్ 27, 2026 వరకు (9 సర్వీసులు) నడుస్తుంది.
జాల్నా - తిరుపతి (ట్రైన్ నం. 07814) : ప్రతి గురువారం నడిచే ఈ రైలు అక్టోబర్ 1, 2026 నుండి నవంబర్ 26, 2026 వరకు (9 సర్వీసులు) అందుబాటులో ఉంటుంది.
తిరుపతి - జాల్నా (ట్రైన్ నం. 07815) : ప్రతి శుక్రవారం నడిచే ఈ రైలు అక్టోబర్ 2, 2026 నుంచి నవంబర్ 27, 2026 వరకు (9 సర్వీసులు) నడుస్తుంది.
హెచ్.ఎస్. నాందేడ్ - తిరుచానూరు (ట్రైన్ నం. 07603): ప్రతి మంగళవారం నడిచే ఈ సర్వీసు అక్టోబర్ 6, 2026 నుంచి నవంబర్ 24, 2026 వరకు (8 సర్వీసులు) పొడిగించారు.
తిరుచానూరు - హెచ్.ఎస్. నాందేడ్ (ట్రైన్ నం. 07604) : ప్రతి బుధవారం నడిచే ఈ రైలు అక్టోబర్ 7, 2026 నుంచి నవంబర్ 25, 2026 వరకు (8 సర్వీసులు) అందుబాటులో ఉంటుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


