SCR Special Trains : తెలుగు ప్రయాణికులకు అలర్ట్... చర్లపల్లి - శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు
Charlapalli Srikakulam Special Trains : చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ నెల 25, 26 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
Charlapalli Srikakulam Special Trains : చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ల నడుమ ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ అందించింది. ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.

ట్రైన్ నంబరు 07037 (చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్) ప్రత్యేక రైలు ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 25వ తేదీ మంగళవారం రోజున చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబరు 07038 (శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి) ప్రత్యేక రైలు ఆగస్టు 26వ తేదీ బుధవారం రోజున శ్రీకాకుళం రోడ్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ రెండు రైళ్లు చెరో ఒక్క ట్రిప్ చొప్పున సర్వీసులను అందిస్తాయి.
హాల్ట్ స్టేషన్ల వివరాలు…
ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ప్రయాణించే క్రమంలో ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. మార్గమధ్యంలో నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఈ రైళ్లకు స్టాపేజీలు కల్పించారు.
హైదరాబాద్ శివార్లలో కొత్తగా రూపుదిద్దుకున్న చర్లపల్లి టెర్మినల్ నుంచి ఉత్తరాంధ్ర వైపు వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో సౌకర్యవంతంగా మారనున్నాయి. టిక్కెట్ బుకింగ్స్ మరియు సమయ వేళల సమాచారం కోసం ప్రయాణికులు ఐఆర్‌సిటిసి (IRCTC) వెబ్‌సైట్ లేదా అధికారిక రైల్వే విచారణ కేంద్రాలను సంప్రదించాలని అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

