కాచిగూడ - తిరుచానూరు మధ్య కొత్తగా వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు… ఈ నెల 20 నుంచే స్టార్ట్..! టైమింగ్స్ ఇలా

కాచిగూడ-తిరుచానూరు-కాచిగూడ (17607/17608) మధ్య కొత్త వారంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈ నెల 20 నుంచి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు…. తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో ఆగుతాయి.

Published on: Aug 18, 2026, 17:41:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. కాచిగూడ నుంచి తిరుచానూరు మధ్య నూతన వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేవలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

కాచిగూడ - తిరుచానూరు మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
కాచిగూడ - తిరుచానూరు మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

రైలు సర్వీసుల షెడ్యూల్ - టైమింగ్స్ :

ఈ కొత్త వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు 17607/17608 నంబర్లను కేటాయించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలు సమయాలను రైల్వే శాఖ ఖరారు చేసింది.

  • కాచిగూడ - తిరుచానూరు (రైలు నంబర్ 17607) : గురువారం రాత్రి 9:30 గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు (శుక్రవారం) ఉదయం 11:55 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది.
  • తిరుచానూరు - కాచిగూడ (రైలు నంబర్ 17608) : తిరుగు ప్రయాణంలో శుక్రవారం సాయంత్రం 4:00 గంటలకు తిరుచానూరు నుంచి బయలుదేరి…. శనివారం ఉదయం 9:00 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది.

హాల్ట్ స్టేషన్లు….

ఈ వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రెండు వైపులా ప్రయాణించే క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా ఈ రైలు తిరుచానూరు చేరుకుంటుంది.

హైదరాబాద్ జంట నగరాలు మరియు ఉమ్మడి నల్గొండ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రయాణికులకు ఈ కొత్త రైలు సర్వీసు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది. ముఖ్యంగా తిరుపతి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ కోరింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More