TTD Update : భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచనలు

Tirumala Tirupati Devasthanam : నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ సందేశాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. టీటీడీ సేవల బుకింగ్‌లు అధికారిక మార్గాల్లోనే చేసుకోవాలని తెలిపింది.

Updated on: Aug 14, 2026, 13:37:06 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ పేరుతో కొందరు మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీలు నిర్వహిస్తూ భక్తులను ఆకర్షిస్తున్నారు. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి తదితర బుకింగ్‌లు ఇప్పిస్తామంటూ నమ్మించి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు టీటీడీకి పలు ఫిర్యాదులు అందాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

ఈ నేపథ్యంలో భక్తులు టీటీడీకి సంబంధించిన దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌లను అధికారిక టీటీడీ వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా మాత్రమే చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. వాట్సాప్, సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల్లో వచ్చే అనధికారిక బుకింగ్ లింకులతో అప్రమత్తంగా ఉండాలి.

టీటీడీ పేరు, లోగో, చిత్రాలు, ట్రేడ్‌మార్క్‌లను ఉపయోగిస్తూ నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ఐటీ, విజిలెన్స్, సైబర్ క్రైమ్ పోలీస్ తదితర విభాగాల సమన్వయం చేసుకుని ప్రత్యేక నిఘా ఉంచినట్టుగా టీటీడీ ప్రకటించింది. ఇటువంటి నకిలీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను గుర్తించి తొలగించడం, బ్లాక్ చేయించడం, దర్యాప్తు చేపట్టేలా చర్యలు తీసుకుంటుంది. గత రెండేళ్లలో 259 ఫేక్ వెబ్ సైట్లను గుర్తించి తొలగించడంతోపాటు ఆ వెబ్‌సైట్‌లకు సంబంధించిన పలువురు వ్యక్తులపై కేసులు నమోదు చేసింది.

టీటీడీ పేరు, లోగో, మేధో సంపత్తిని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తులు, సంస్థలపై కాపీరైట్, ట్రేడ్‌మార్క్, సైబర్ చట్టాల ప్రకారం తగిన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టుగా టీటీడీ ప్రకటించింది.

భక్తులకు టీటీడీ జాగ్రత్తలు

టీటీడీ సేవలు, దర్శనం, వసతి బుకింగ్‌లను అధికారిక టీటీడీ వెబ్‌సైట్/యాప్‌లో మాత్రమే చేసుకోవాలి. వాట్సాప్‌లో వచ్చే అనధికారిక బుకింగ్ సందేశాలు, లింకులను నమ్మకూడదు. టీటీడీ పేరుతో ఉన్న నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా పేజీలను చూసి మోసపోవద్దు. తెలియని వ్యక్తులకు బుకింగ్ పేరుతో డబ్బులు పంపవద్దు. టీటీడీ పేరు, లోగోను ఉపయోగిస్తున్న వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా ఖాతా అధికారికమైనదో కాదో నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలి. భక్తులు అప్రమత్తంగా ఉండి, నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ సందేశాల ద్వారా జరిగే సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

తిరుపతి తొండమాన్ పురంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 26 నుండి 28వ తేదీ వరకు పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 25న సాయంత్రం 6 గంటలకు శాస్త్రోక్తంగా అంకురార్పణంతో పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 26న ఉదయం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 27న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం చతుష్టానార్చన చేపడతారు. ఆగస్టు 28న ఉదయం మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ, స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహించడంతో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ముగుస్తాయి. అనంతరం సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.

ఈ పవిత్రోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ కోరింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More