Tirupati-Tiruvannamalai : తిరుపతి-అరుణాచలం రహదారి అభివృద్ధిపై అప్డేట్

ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని పుణ్యక్షేత్రాలను కనెక్ట్ చేసే తిరుపతి-అరుణాచలం జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టు మరింత వేగం పుంజుకోనుంది. భక్తుల సౌకర్యార్థం ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఎంపీలు.

Published on: Aug 13, 2026, 10:10:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుపతి (ఆంధ్రప్రదేశ్), తిరువణ్ణామలై (తమిళనాడు) నగరాలను అనుసంధానించే జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని కోరుతూ ముగ్గురు పార్లమెంట్ సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర ప్రతినిధి బృందం న్యూఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలసి విజ్ఞప్తి చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఎంపీలు ఎం. గురుమూర్తి (తిరుపతి), వై.ఎస్. అవినాష్ రెడ్డి (కడప), సి.ఎన్. అన్నాదురై (తిరువణ్ణామలై) సంయుక్తంగా ఈ వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి సమర్పించారు. తిరుపతి, కాణిపాకం, వేలూరు, తిరువణ్ణామలై వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను అనుసంధానించే ఈ రహదారిని అభివృద్ధి చేయడం వల్ల ఆధ్యాత్మిక పర్యాటకం గణనీయంగా పుంజుకుంటుందని వారు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో ఈ పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తుల సంఖ్యతో పాటు, ఈ పర్యాటక ప్రాంతాల పరిసరాల్లో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిందని ఎంపీలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెరుగుతున్న వాహనాల రాకపోకలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కోరారు.

జాతీయ రహదారులపై ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు, ప్రయాణికుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఈ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. తమ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని, ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలను తక్షణమే పరిశీలిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ గురుమూర్తి విలేకరులకు తెలిపారు.

పెరుగుతున్న వాహనాల రాకపోకల అనుగుణంగా రహదారిని అభివృద్ధి చేయాలని ఎంపీలు కోరారు. ప్రస్తుతం ఉన్న సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రహదారి విస్తరణ, అవసరమైన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ప్రయాణ సమయాన్ని తగ్గించాలన్నారు. వాహనదారులకు మెరుగైన భద్రత కల్పించాలన్నారు.

ఈ రూట్ అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడుమధ్య రవాణా మరింత సులభతరం అవుతుందని గడ్కరీకి ఎంపీలు వివరించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందని తెలిపారు. నిత్యం రాకపోకలు సాగించే భక్తులు, వ్యాపార వర్గాలకు అధిక ప్రయోజనం కలుగుతుందన్నారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More