బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు!

బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది.

Updated on: Aug 12, 2026, 16:33:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ సూచన ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాల ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు.

ఏపీలో వర్షాలు
ఏపీలో వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో రెండుమూడు రోజులు వాతావరణం మేఘావృతమై, తేమతో కూడి ఉంటుంది. ఉత్తరాంధ్రలో సాయంత్రం నుండి రాత్రి వరకు జల్లులు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడుతుండగా, రాయలసీమలో చాలా వరకు పొడిగా ఉంటుంది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా అకస్మాత్తుగా, స్వల్పకాలిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ అంతటా గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎమ్‌డీ హెచ్చరించింది.

తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, జనగాం, మహబూబాబాద్, నల్గొండ, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉండగా, అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

రాబోయే వారం రోజులు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో ఇదే సమయంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లోనూ రాత్రి సమయాల్లో ఒకటి వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లో అడపాదడపా స్వల్పకాలిక వర్షాలు మొదలయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు ఇవి మధ్య, దక్షిణ, తూర్పు హైదరాబాద్ ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయి. ఆగస్టు 12న తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మేఘాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి వరకు వర్షాలు పడనున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More