తెలంగాణలో రైతులకు ఐఎండీ ద్వారా పంచాయతీ లెవెల్ వాతావరణ సూచనలు : కేంద్రం

తెలంగాణలో రైతులకు పంచాయతీ లెవెల్ వాతావరణ సూచనలను ఐఎండీ అందిస్తోందని కేంద్రం తెలిపింది. ఐఎండీ క్రమం తప్పకుండా అందిస్తున్న సూచనల ద్వారా రాష్ట్రంలోని రైతులకు మేలు జరుగుతోందని చెప్పారు.

Published on: Aug 7, 2026, 05:29:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో వరదలను ముందస్తుగా అంచనా వేసేందుకు అధునాతన న్యూమెరికల్ వెదర్ ప్రిడిక్షన్ మోడళ్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. వాతావరణ సమాచారం, వరద నిర్వహణపై రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఐఎండీ వెదర్
ఐఎండీ వెదర్

గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వరద హెచ్చరికల వ్యవస్థలు, భూకంప గుర్తింపు కేంద్రాల విస్తరణ, రైతులకు అందించే వ్యవసాయ-వాతావరణ సూచనలపై ఎంపీ కోరిన సమాచారం మేరకు కేంద్ర మంత్రి వివరాలను వెల్లడించారు.

ప్రతిపాదిత ప్రాజెక్టులు, కీలక ప్రాంతాలలో వరద ముందస్తు సమాచారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవేసే బాధ్యతను సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్వహిస్తోందని కేంద్రమంత్రి తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా భారత వాతావరణ శాఖ (IMD) 25 ఫ్లడ్ మెటియోరోలాజికల్ ఆఫీసులను నడుపుతోందన్నారు. ఇవి దేశంలోని 220 సబ్-బేసిన్లకు ఏడు రోజుల వ్యవధితో రోజువారీ వర్షపాత అంచనాలను అందిస్తాయని పేర్కొన్నారు. ఈ అంచనాల తయారీలో ఐఎమ్‌డీ ఏఐ, గణాంక వాతావరణ మోడళ్లను ఉపయోగిస్తోంది.

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తమ 'నేషనల్ సీస్మోలాజికల్ నెట్‌వర్క్' (NSN) ద్వారా దేశవ్యాప్తంగా భూకంప కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందని కేంద్రమంత్రి చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాద్‌లో ఒక సీస్మోలాజికల్ అబ్జర్వేటరీ అందుబాటులో ఉందన్నారు. ఈ నెట్‌వర్క్ ద్వారా తెలంగాణ పరిధిలో రిక్టర్ స్కేలుపై 3.0, అంతకంటే ఎక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాలను సులభంగా గుర్తించవచ్చన్నారు.

ఐఎండీ క్రమం తప్పకుండా అందిస్తున్న వ్యవసాయ-వాతావరణ సూచనల ద్వారా రాష్ట్రంలోని రైతులకు మేలు జరుగుతోందని చెప్పారు. పంచాయత్ మాసమ్ సేవా పోర్టల్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బ్లాక్, పంచాయతీ స్థాయిలలో వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ సూచనలను వాట్సాప్‌తో పాటు కృషి సఖీలు, పశు సఖీల వంటి క్షేత్రస్థాయి యంత్రాంగం ద్వారా రైతులకు వేగంగా చేరవేస్తున్నారని తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More