Onam Special Trains : కేరళ ఓనం పండగకు చర్లపల్లి-కొట్టాయం మధ్య ప్రత్యేక రైళ్లు
Onam Special Trains : కేరళ ఓనం పండగకు చర్లపల్లి-కొట్టాయం మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రైల్వే శాఖ. మెుత్తం ఆరు సర్వీసులను నడుపుతున్నట్టుగా వెల్లడించింది.
కేరళలో ఎంతో ఘనంగా నిర్వహించుకునే ఓనం పండగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ పరిధిలోని చర్లపల్లి నుంచి కేరళలోని కొట్టాయం మధ్య మొత్తం 6 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్ వెల్లడించారు.

ఆగస్టు 16 నుంచి 31వ తేదీ మధ్యలో ఈ ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. సాధారణంగా కాజీపేట, విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లకు భిన్నంగా, ఈ స్పెషల్ రైళ్లు నల్లగొండ, గుంటూరు మీదుగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
ఈ ప్రత్యేక రైళ్లు వారంలో నిర్ణీత రోజుల్లో మాత్రమే నడుస్తాయి. వాటి సమయాలు, నంబర్ల వివరాలు కింద ఉన్నాయి. చర్లపల్లి - కొట్టాయం స్పెషల్ (ట్రైన్ నంబర్: 07197) ప్రతి ఆదివారం ఆగస్టు 16, 23, 30 తేదీలలో నడుస్తుంది. చర్లపల్లిలో ఉదయం 7:15 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12:25 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.
కొట్టాయం - చర్లపల్లి స్పెషల్ (ట్రైన్ నంబర్: 07198) ప్రతి సోమవారం ఆగస్టు 17, 24, 31 తేదీలలో ఉంటుంది. కొట్టాయంలో సాయంత్రం 4:45 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు అర్ధరాత్రి 12:30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
ఈ స్పెషల్ రైళ్లు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలోని పలు ముఖ్యమైన కూడళ్ల ద్వారా ప్రయాణిస్తాయి. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోడనూర్, పాలక్కాడ్. త్రిశూర్, అలువ, ఎర్నాకుళం (టౌన్)లో ఆగుతాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైలులో అన్ని రకాల తరగతుల బోగీలను అందుబాటులో ఉంచారు. సెకండ్ ఏసీ (2AC, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కేరళకు వెళ్లే ప్రయాణికులు, వ్యాపారులు, పర్యాటకులు ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
ట్రైన్ టైమింగ్స్ మార్పు
సాంకేతిక, నిర్వహణ కారణాల వల్ల హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరే రెండు ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలను రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.
హైదరాబాద్ – విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు: 12728): నిర్ణీత సమయం ఆగస్టు 16, 2026 సాయంత్రం 05:05 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఈ రైలు అదే రోజు సాయంత్రం 07:05 గంటలకు హైదరాబాద్ నుండి ఆలస్యంగా బయలుదేరుతుంది.
హైదరాబాద్ – చెన్నై బీచ్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు: 12760): ఆగస్టు 16, 2026 సాయంత్రం 06:00 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఈ రైలు అదే రోజు రాత్రి 07:15 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ సమయ మార్పులను గమనించి, దానికి అనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


