IRCTC Kerala Tour : బడ్జెట్ ధరలో కేరళ చూడాలనుకుంటున్నారా? ఆగస్టు 25న ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ
కేరళ చూడాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్ అందించింది. కేరళ హిల్స్ అండ్ వాటర్స్ పేరుతో టూర్ ఆపరేట్ చేస్తోంది. బడ్జెట్ ధరలో వెళ్లి రావొచ్చు.
కేరళ అందాలను తిలకించాలనుకునే పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) ఒక అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. కేరళ హిల్స్ & వాటర్స్(KERALA HILLS & WATERS) పేరిట ఈ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో కేరళలోని ప్రముఖ కొండ ప్రాంతాలు, సుందరమైన బ్యాక్‌వాటర్స్, తేయాకు తోటలను సందర్శించే అవకాశం లభిస్తుంది. మున్నార్, అలెప్పీ ప్రాంతాలను చూసి రావొచ్చు.

ఏ రోజు? ఎలా?
హైదరాబాద్ నుండి ప్రారంభమయ్యే ఈ టూర్ 5 రాత్రులు / 6 రోజులు. ఆగస్టు 25వ తేదీ నుంచి టూర్ మెుదలవుతుంది. సికింద్రాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ప్రతీ మంగళవారం ఈ టూర్ ఉంటుంది. నల్గొండ, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్ నుంచి కూడా ట్రైన్ ఎక్కవచ్చు.
మెుదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 02:25 గంటలకు రైలు నెం. 20629 శబరి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరుతారు.
రెండో రోజు బుధవారం 11:30 గంటలకు ఆలూవా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. మిమ్మల్ని తీసుకుని మున్నార్ (110 కి.మీ.)కు వెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేసి.. రాత్రి మున్నార్‌లో బస ఉంటుంది
మూడోరోజు ఎరవికుళం జాతీయ పార్కును సందర్శిస్తారు. తరువాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్ & ఎకో-పాయింట్‌ను సందర్శిస్తారు. రాత్రి మున్నార్‌లోనే బస.
నాలుగో రోజు చెక్ అవుట్ చేసి అలప్పుజకు(170 కి.మీ.) బయలుదేరుతారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. బ్యాక్‌వాటర్స్‌ను ఆస్వాదించడానికి వెళ్తారు. రాత్రి అలప్పుజలోనే బస.
ఐదో రోజు చెక్ అవుట్ చేసి ఎర్నాకుళం (60 కి.మీ.)కు బయలుదేరుతారు. ఉదయం 11:15 గంటలకు రైలు నెం. 20630, శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్‌లో దిగుతారు. రాత్రిపూట ప్రయాణం.
ఆరో రోజు ఆదివారం ఉదయం 11:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
టూర్ ధరలు
సింగిల్ షేరింగ్ కంఫర్ట్ 3ఏ రూ.32400, ట్విన్ షేరింగ్ రూ.18990, ట్రిపుల్ షేరింగ్ రూ.16750, చైల్డ్ విత్ బెడ్ రూ.8840, చైల్డ్ వితౌట్ బెడ్ రూ. 8570గా ఉంది.
స్టాండర్డ్ ఎస్ఎల్ సింగిల్ షేరింగ్‌కు రూ.29580, ట్విన్ షేరింగ్ రూ.16170, ట్రిపుల్ షేరింగ్ రూ.13940, చైల్డ్ విత్ బెడ్ రూ.13940, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.5750గా ఉంది.
బుకింగ్ ఎలా చేసుకోవాలి?
ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రయాణ తేదీలు, బుకింగ్ కోసం పర్యాటకులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ irctctourism.com ను సందర్శించవచ్చు. అంతేకాకుండా ఐఆర్‌సీటీసీ సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ టూరిజం ఆఫీసుల్లో కూడా నేరుగా సంప్రదించి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


