దక్షిణ మధ్య రైల్వే అలర్ట్.. ఈ తేదీల్లో పలు రైళ్లు రద్దు, సమయాల్లో మార్పులు

South Central Railway : దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ప్రయాణికులకు కీలక అప్డేట్ ఇచ్చింది. నాన్-ఇంటర్లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు, సమయాల్లో మార్పులు చేసింది.

Published on: Aug 19, 2026, 06:54:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్ - డోన్ రైల్వే సెక్షన్‌లో ఉన్న దూపాడు స్టేషన్‌లో అదనపు లూప్ లైన్ పనుల నిమిత్తం నాన్-ఇంటర్లాకింగ్ పనులను దక్షిణ మధ్య రైల్వే చేపడుతోంది. ఈ పనుల కారణంగా పలు రైళ్ల సర్వీసులను రద్దు చేయడంతో పాటు, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అలాగే కొన్ని రైళ్ల రాకపోకల్లో సమయ మార్పులు ఉంటాయని తెలిపారు.

రైల్వే అప్డేట్
రైల్వే అప్డేట్

ఆగస్టు 24, 25, 26 తేదీల్లో ప్రయాణాలు చేయాలనుకునే ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, తగిన విధంగా తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.

ట్రైన్ నెంబర్ 77207 డోన్ - కర్నూలు సిటీ ఆగస్టు 24, 25, 26 తేదీలలో రద్దు చేశారు.

రైలు సంఖ్య 77209 కర్నూలు సిటీ – నంద్యాల ఆగస్టు 24, 25, 26 తేదీల్లో ఈ రైలు కర్నూలు సిటీ - డోన్ స్టేషన్ల మధ్య రద్దు అయింది. అంటే ఇది కర్నూలు సిటీకి బదులుగా డోన్ నుంచి నంద్యాల వరకు మాత్రమే నడుస్తుంది.

మరమ్మతు పనుల కారణంగా రైలు సంఖ్య 17253 గుంటూరు ఛత్రపతి శంభాజీనగర్ ఆగస్టు 24, 25, 26 తేదీల్లో 120 నిమిషాలు (2 గంటలు) ఆలస్యంగా నడుస్తుంది.

రైలు సంఖ్య 57412 కాచిగూడ - గుంతకల్ రైలు మార్గమధ్యంలో 60 నిమిషాలు (1 గంట) ఆలస్యంగా నడుస్తుంది.

రైళ్ల సమయ వేళలు, తాజా సమాచారం తెలుసుకోవడానికి ప్రయాణికులు అధికారిక వెబ్‌సైట్ enquiry.indianrail.gov.in ను సందర్శించవచ్చు లేదా 139 రైల్వే హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. ప్రయాణానికి ముందే మీ రైలు స్థితిని తనిఖీ చేసుకోవడం ఉత్తమం.

మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ నుంచి తిరుచానూరు మధ్య నూతన వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేవలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ కొత్త వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు 17607/17608 నంబర్లను కేటాయించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలు సమయాలను రైల్వే శాఖ ఖరారు చేసింది.

కాచిగూడ - తిరుచానూరు (రైలు నంబర్ 17607) : గురువారం రాత్రి 9:30 గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు (శుక్రవారం) ఉదయం 11:55 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది.

తిరుచానూరు - కాచిగూడ (రైలు నంబర్ 17608) : తిరుగు ప్రయాణంలో శుక్రవారం సాయంత్రం 4:00 గంటలకు తిరుచానూరు నుంచి బయలుదేరి.. శనివారం ఉదయం 9:00 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More