ఏపీ వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 107 ఖాళీలున్నాయి. ఆయుష్ విభాగంలోని ఈ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం 107 ఖాళీలు…

మొత్తం 107 ఖాళీలు ఉండగా... వీటిలో అధికంగా ఆయుర్వేద డాక్టర్ పోస్టులు 51 ఉన్నాయి. ఇక డిస్ట్రిక్ ప్రోగ్రామ్ మేనేజర్ ఉద్యోగాలు 26, హోమియోపతి ఆయూష్ డాక్టర్ ఖాళీలు 15 ఉన్నాయి. యోగా ఇన్ స్ట్రక్టర్ పోస్టులు 4 ఉండగా.. వీటిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు. మిగతా పోస్టులన్నీ కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేస్తారు.
ఈ పోస్టులకు నవంబర్ 1వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతుండగా… నవంబర్ 15వ తేదీతో గడువు ముగుస్తుంది. అర్హులైన అభ్యర్థులు apmsrb.ap.gov.in/msrb/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.
దరఖాస్తు విధానం, అప్లికేషన్ ఫీజు, అర్హతల వివరాలకు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో చూడొచ్చు. ఈ వివరాలను https://hmfw.ap.gov.in లేదా https://ayush.ap.gov.in వెబ్ సైట్ లో కూడా తెలుసుకోవచ్చు.