AP Medical Recruitment 2026: ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు జాబ్ నోటిఫికేషన్.. కేవలం ఇంటర్వ్యూనే

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మెుత్తం 32 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Published on: Jun 21, 2026, 19:18:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(APMSRB) కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక ప్రకటన విడుదలైంది.

ఆంధ్రప్రదేశ్ జాబ్ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ జాబ్ నోటిఫికేషన్

మొత్తం 32 ఖాళీలను భర్తీ చేసేందుకు బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా, కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యా అర్హతలు, వేతనం, ఇంటర్వ్యూ వేదిక వంటి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

పోస్టుల వివరాలు

రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ప్రధానంగా రెండు విభాగాల్లో స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

పీడియాట్రిషియన్‌ : 17 పోస్టులు

కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌ : 15 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 32

కావలసిన అర్హతలు

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ (MD) లేదా మెడికల్ పీజీ (PG) డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (APMC/APRC) లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉండాలి. సంబంధిత విభాగంలో వైద్యుడిగా పని చేసిన ముందస్తు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

వయోపరిమితి

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 42 సంవత్సరాలు మించకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఆకర్షణీయమైన జీతభత్యాలు

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం ప్రతి నెలా భారీ వేతనాన్ని అందించనున్నారు. పీడియాట్రిషియన్‌ పోస్టుకు నెలకు రూ. 1,10,000, కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌ పోస్టుకు నెలకు రూ. 1,00,000 ఇస్తారు.

ఇంటర్వ్యూ వివరాలు

అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలు, విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఎక్స్పీరియన్స్ లెటర్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. జూలై 02, 2026న ఉదయం 10:00 గంటల నుండి ఏపీ మెడికల్‌ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌, గ్రౌండ్‌ ఫ్లోర్, ఐటీ పార్క్, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్వ్యూ ఉంటుంది.

అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్, నోటిఫికేషన్ పూర్తి నిబంధనలు, మరిన్ని అప్‌డేట్ల కోసం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://apmsrb.ap.gov.in ను సందర్శించవచ్చు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిశీలించబోరని అధికారులు స్పష్టం చేశారు.

ఈ లింక్ క్లిక్ చేసి అధికారిక వెబ్‌సైట్ వెళ్లండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More