TGPSC DEO Notification 2026 : టీజీపీఎస్సీ నుంచి జాబ్ నోటిఫికేషన్.. డీఈవో పోస్టుల రిక్రూట్‌మెంట్.. భారీ జీతం

TGPSC DEO Notification 2026 : టీజీపీఎస్సీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Updated on: Jun 6, 2026, 05:40:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) Deputy Educational Officer / Head Master Grade - I ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖలో మెుత్తం 24 పోస్టులను భర్తీ చేయనుంది.

టీజీపీఎస్సీ డీఈవో జాబ్ నోటిఫికేషన్
టీజీపీఎస్సీ డీఈవో జాబ్ నోటిఫికేషన్

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.tgpsc.gov.in ద్వారా జూన్ 12 నుండి జూలై 19, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలని కమిషన్ సూచించింది. ఈ నోటిఫికేషన్‌లో అర్హతలు, ఖాళీలు, పరీక్షా విధానం, సిలబస్, ముఖ్యమైన తేదీల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షను అక్టోబర్ 2026 నెలలో నిర్వహించనున్నారు. ఈ పోస్టులకు రూ. 58,850 నుండి రూ. 1,37,050 వరకు జీతం ఉంటుంది.

టీజీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / హెడ్‌మాస్టర్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 12 జూన్ నుండి 19 జూలై 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుండి 44 సంవత్సరాలు (జూలై 1, 2026 నాటికి) ఉండాలి.

  • జనరల్ / ఓసీ – 18 నుండి 44 సంవత్సరాలు
  • ఎస్సీ / ఎస్టీ / బీసీ / ఈడబ్ల్యూఎస్ – 18 నుండి 49 సంవత్సరాలు (5 సంవత్సరాల సడలింపు)
  • దివ్యాంగులు (PwD) – 18 నుండి 54 సంవత్సరాలు (10 సంవత్సరాల సడలింపు)
  • మాజీ సైనికులు – 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం సేవ చేసి ఉండాలి

పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఈ పోస్టులను మల్టీ-జోనల్ (Multi-Zonal - MZ) పోస్టులుగా వర్గీకరించారు. మల్టీ-జోన్ I-10, మల్టీ-జోన్ II-14 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి B.Ed. కోర్సులో ప్రవేశానికి అర్హతనిచ్చే సబ్జెక్టులతో కూడిన బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ) కలిగి ఉండాలి.

పరీక్షను (ఆబ్జెక్టివ్ విధానం) ఓఎంఆర్ ఆధారిత ఆఫ్‌లైన్ పద్ధతిలో లేదా కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్ష (CBRT) పద్ధతిలో నిర్వహించే హక్కును కమిషన్ కలిగి ఉంది. పరీక్షా విధానాన్ని కమిషన్ వెబ్ నోట్ / పత్రికా ప్రకటన ద్వారా, హాల్ టికెట్‌లో తెలియజేస్తుంది.

ఈ లింక్ క్లిక్ చేసి డీఈవో పోస్టుల నోటిపికేషన్ చదవండి

తరచూ అడిగే ప్రశ్నలు

TGPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / హెడ్ మాస్టర్ రిక్రూట్‌మెంట్ 2026 కింద ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

  • పాఠశాల విద్యా శాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-I పోస్టుకు మొత్తం 24 ఖాళీలను టీజీపీఎస్సీ ప్రకటించింది.

TGPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / హెడ్ మాస్టర్ పోస్టుకు జీతం ఎంత?

  • ఎంపికైన అభ్యర్థులు ఇతర అనుమతించదగిన అలవెన్సులతో పాటు రూ. 58,850 నుండి రూ. 1,37,050 వరకు పే స్కేలును అందుకుంటారు.

TGPSC DEO హెడ్ మాస్టర్ పోస్టుకు ఏ విద్యా అర్హత అవసరం?

  • అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.Ed. కోర్సులో ప్రవేశానికి అర్హత గల సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. 55 శాతం మార్కులతో పీజీ ఉండాలి.
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More