Singareni Polytechnic College : సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్లు - అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా
Singareni Polytechnic Admissions 2026 : మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 8వ తేదీ వరకు గడువు ఉంది.
Singareni Polytechnic Admissions 2026 : సింగరేణి సంస్థ పరిధిలోని ఉద్యోగులు, విశ్రాంత కార్మికుల పిల్లలకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో మంచిర్యాల జిల్లా నస్పూర్ (CCC) లో ఏర్పాటు చేసిన సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ (SCP) కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు కల్పిస్తారు.

ఈ కళాశాలలో మొత్తం 300 సీట్లు అందుబాటులో ఉండగా… వీటిని ఎస్సీసీఎల్ మేనేజ్‌మెంట్ కోటా కింద 150 సీట్లు, ప్రభుత్వ కోటా కింద 150 సీట్లుగా విభజించారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ప్రస్తుత ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల వారసుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన 150 సీట్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి…
- సివిల్ ఇంజినీరింగ్: 30 సీట్లు (మొత్తం సీట్లు: 60)
- కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్: 30 సీట్లు (మొత్తం సీట్లు: 60)
- ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 30 సీట్లు (మొత్తం సీట్లు: 60)
- మెకానికల్ ఇంజినీరింగ్: 30 సీట్లు (మొత్తం సీట్లు: 60)
- మైనింగ్ ఇంజినీరింగ్: 30 సీట్లు (మొత్తం సీట్లు: 60)
మేనేజ్‌మెంట్ కోటాలోని ఈ 150 సీట్లకు కేవలం సింగరేణి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పిల్లలు మాత్రమే అర్హులు. వీటికి అదనంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (EWS) అభ్యర్థుల కోసం మరో 15 సీట్లను ప్రత్యేకంగా కేటాయించారు.
పాలిటెక్నిక్ కళాశాలలో చేరాలనుకునే సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఈ నెల 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తర్వాత కౌన్సెలింగ్ తేదీలను అధికారికంగా ప్రకటిస్తారు. కళాశాలలో చేరే అభ్యర్థులకు నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అత్యాధునిక సదుపాయాలతో పాటు ప్లేస్‌మెంట్స్ కల్పిస్తామని కాలేజ్ యాజమాన్యం వెల్లడించింది.
కౌన్సెలింగ్‌కు కావాల్సిన ముఖ్యమైన పత్రాలు:
- కులం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్
- 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ/బోనఫైడ్ సర్టిఫికెట్లు
- నివాస ధ్రువీకరణ పత్రం (Residence Certificate)
- ఎస్ఎస్‌సీ షార్ట్ మెమో లేదా ఇంటర్నెట్ కాపీ
- టీసీ (Transfer Certificate) ఒరిజినల్
- పాలిసెట్ హాల్ టికెట్ మరియు ర్యాంక్ కార్డ్
- విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు
- బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ జిరాక్స్
- మైన్ మేనేజర్ సంతకంతో కూడిన తండ్రి సర్వీస్ సర్టిఫికెట్ (తప్పనిసరి)
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఒరిజినల్ కాపీ, 8 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, 10 ఎన్‌వలప్ కవర్లు
- పైన పేర్కొన్న అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ సెట్లు (4 కాపీలు)
అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ల కొరకు అధికారిక ఆన్‌లైన్ లింక్ https://scp.scpolytechnic.com/counseling/ ను సందర్శించవచ్చు. అడ్మిషన్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 8790112515, 9908151618, 9010222161 మొబైల్ నంబర్లలో లేదా scp161@gmail.com ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని కళాశాల యాజమాన్యం ఓ ప్రకటన ద్వారా కోరింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

