...
...
Next Story

APMS Entrance Results : ఏపీ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల - స్కోర్ కార్డు ఇలా చెక్ చేసుకోండి

AP Model School Results 2026 : ఏపీ మోడల్ స్కూల్స్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 16,288 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను https://apms.apcfss.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

Published on: Apr 23, 2026, 06:28:59 IST
Advertisement

AP Model School Results 2026 : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో చేరేందుకు వేచి చూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ అధికారులు గురువారం విడుదల చేశారు.

ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలు 2026
ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలు 2026

మొత్తం 164 మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం మొత్తం 26,408 మంది విద్యార్థులు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 23,540 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం అడ్మిషన్లకు అర్హత సాధించిన వారి సంఖ్య 16,288గా ఉంది. ఉత్తీర్ణులైన వారిలో 7,991 మంది బాలురు ఉండగా, 8,297 మంది ఉన్నారు.

ఈ ఏడాది ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థి మెరిశారు. ఓవీ పేట ఆదర్శ పాఠశాలకు దరఖాస్తు చేసుకున్న బొడ్డేపల్లి యోజిత్ 99 శాతం మార్కులతో రాష్ట్రస్థాయిలోనే అత్యధిక స్కోరు సాధించినట్లు అధికారులు ప్రకటించారు. అట్టడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ పాఠశాలల్లో సీటు దక్కించుకోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ మోడల్ స్కూల్ ఫలితాలు ఎలా చూసుకోవాలి?

  • ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://apms.apcfss.in/ లేదా cse.ap.gov.in సందర్శించాలి.
  • హోం పేజీలో కనిపించే 'రిజల్ట్' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • స్కోర్ కార్డు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి, ఇక్కడ విద్యార్థి లాగిన్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • సబ్మిట్ చేస్తే మీ స్కోర్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందొచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks