Study in India : ఇండియాలో చదువుకు క్యూ కడుతున్న విదేశీ విద్యార్థులు! గ్లోబల్ స్టూడెంట్ హబ్‌గా భారత్..
అంతర్జాతీయ విద్యార్థులకు అత్యంత వేగంగా ఎదుగుతున్న గమ్యస్థానంగా భారతదేశం మారుతోందని 'గ్లోబల్ స్టూడెంట్ ఫ్లోస్, ఇండియా' నివేదిక వెల్లడించింది. 2030 నాటికి ఇన్-బౌండ్ విద్యార్థుల సంఖ్య ఏటా 8% వృద్ధి చెందుతుందని నివేదిక పేర్కొంది.
చదువు కోసం అంతర్జాతీయ విద్యార్థుల గమ్యస్థానాలపై క్వాక్వరెల్లి సైమండ్స్ (క్యూఎస్) తన 8వ వార్షిక నివేదికను విడుదల చేసింది. క్యూఎస్ సొంత ఫ్లో-మ్యాపింగ్ టెక్నాలజీ, ‘క్యూఎస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వే 2025’, వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ డేటా ఆధారంగా ఈ విశ్లేషణను రూపొందించారు. ఇండియాలో చదువుకుంటున్న విదేశీయుల సంఖ్య ప్రతియేటా పెరుగుతోందని ఈ 'గ్లోబల్ స్టూడెంట్ ఫ్లోస్, ఇండియా' నివేదిక నివేదిక సూచిస్తోంది.

భారత్‌కు పెరుగుతున్న విదేశీ విద్యార్థుల తాకిడి..
2025 నాటికి భారత్‌లో చదువుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య 58,000 ఉండొచ్చని అంచనా. 2030 నాటికి ఇది ఏటా 8% వృద్ధి రేటుతో పెరుగుతూ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్యా గమ్యస్థానాల్లో ఒకటిగా భారత్ నిలుస్తుంది. తద్వారా గ్లోబల్ స్టూడెంట్ హబ్‌గా ఇండియా మారే అవకాశం ఉంది.
అమెరికా, యూకే, కెనడా వంటి సంప్రదాయ ఆంగ్ల దేశాల్లో కఠినమైన వీసా నిబంధనలు, పెరుగుతున్న ఖర్చుల వల్ల విద్యార్థులు భారత్ వంటి ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు.
ప్రాంతాల వారీగా విశ్లేషణ..
దక్షిణాసియా: భారత్‌లోని విదేశీ విద్యార్థుల్లో సగం మంది ఈ ప్రాంతం వారే! నేపాల్, బంగ్లాదేశ్ విద్యార్థులు 30% వాటాను కలిగి ఉన్నారు. నేపాల్ నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య ఏటా 11% పెరిగే అవకాశం ఉంది. అయితే వీసా ఇబ్బందుల వల్ల అఫ్గానిస్తాన్ విద్యార్థుల వృద్ధి 1% కంటే తక్కువగా ఉండవచ్చు.
ఆఫ్రికా: సబ్-సహారన్ ఆఫ్రికా నుంచి విద్యార్థుల ప్రవాహం ఏటా 6% పెరగనుంది. ముఖ్యంగా జింబాబ్వే విద్యార్థుల సంఖ్య 11% వృద్ధి చెందుతుందని అంచనా. దీనివల్ల 2030 నాటికి భారత్‌కు విద్యార్థులను పంపే ఆఫ్రికా దేశాల్లో జింబాబ్వే 6వ స్థానానికి చేరుకోనుంది.
ఎంఈఎన్ఏ ప్రాంతం: మధ్యప్రాచ్య దేశాల నుంచి కూడా స్థిరమైన వృద్ధి కనిపిస్తోంది. 2030 నాటికి యూఏఈ విద్యార్థులు భారత్‌లోని విదేశీ విద్యార్థుల్లో 5% వాటాను దక్కించుకోనున్నారు!
ప్రభుత్వ సంస్కరణలు - లక్ష్యాలు..
'స్టడీ ఇన్ ఇండియా' కార్యక్రమం, జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 వంటి సంస్కరణలు భారత్ ఆకర్షణను పెంచాయి. విదేశీ విద్యార్థుల కోసం విద్యా సంస్థల్లో 25% అదనపు సీట్లను కేటాయించడానికి యూజీసీ అనుమతించింది. 2047 నాటికి 5 లక్షల మంది విదేశీ విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వాలనేది భారత్ దీర్ఘకాలిక లక్ష్యం.
మూడు ప్రధాన సవాళ్లు..
భారత విద్యా సంస్థలు ఈ ఊపును కొనసాగించాలంటే కింది అంశాలను పరిష్కరించాలని నివేదిక హెచ్చరించింది:
అకాడమిక్ రెప్యుటేషన్: ఎంప్లాయర్ రెప్యుటేషన్‌లో భారత్ 2017 నుంచి 61 స్థానాలు మెరుగుపడినప్పటికీ, అకాడమిక్ ర్యాంకింగ్స్‌లో పురోగతి తక్కువగా ఉంది.
ఉపాధి అవకాశాలు: 2025 మెర్సర్-మెట్ల్ నివేదిక ప్రకారం భారత్‌లో కేవలం 42.6% పట్టభద్రులు మాత్రమే ఉద్యోగాలకు అర్హులుగా ఉన్నారు. పరిశ్రమలతో అనుసంధానం పెరగాలని 50% మంది విద్యార్థులు కోరుతున్నారు.
మౌలిక సదుపాయాలు: విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ క్యాంపస్ వసతులు, హాస్టల్ సౌకర్యాలు, సపోర్ట్ సర్వీసెస్‌పై భారీగా పెట్టుబడులు పెట్టాలి.
భవిష్యత్ పరిస్థితులు..
క్యూఎస్ ఇండియా చైర్ అశ్విన్ ఫెర్నాండెజ్ ప్రకారం, భవిష్యత్తులో విద్యా రంగం మూడు మార్గాల్లో ఉండనుంది:
రెగ్యులేటెడ్ రీజినలిజం: భౌగోళిక రాజకీయ మార్పుల వల్ల ప్రాంతీయ విద్యా కేంద్రాలు బలోపేతం కావడం.
డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్: టెక్నాలజీ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందిన విద్యా సర్టిఫికేట్లు అందించడం.
గ్లోబల్ టాలెంట్ వార్: ప్రతిభావంతులైన విద్యార్థులను ఆకర్షించేందుకు దేశాల మధ్య పోటీ పెరగడం.
భారతీయ విద్యార్థుల విదేశీ ప్రయాణాలు..
భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టూడెంట్ ఎక్స్‌పోర్టర్. 2024 నాటికి 8 లక్షల మంది భారతీయులు విదేశాల్లో చదువుతున్నారు. అయితే అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా (బిగ్ ఫోర్) వెళ్లే వారి సంఖ్య ఏటా 0.5% తగ్గే అవకాశం ఉంది. దీనికి బదులుగా భారతీయ విద్యార్థులు జర్మనీ, ఫ్రాన్స్, యూఏఈ వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం జర్మనీ, యూఏఈలలో అత్యధిక సంఖ్యలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు భారతీయులే కావడం విశేషం.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. భారత విద్యార్థులు అమెరికా, యూకేలను వదిలి జర్మనీ, ఫ్రాన్స్ వైపు ఎందుకు చూస్తున్నారు?
అమెరికా వంటి దేశాల్లో పెరుగుతున్న విద్యా ఖర్చులు,s కఠినమైన వీసా నిబంధనలే ప్రధాన కారణం. జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు సరసమైన ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలను సులభతరం చేస్తున్నాయి.
2. 2047 నాటికి 5 లక్షల విదేశీ విద్యార్థులను ఆకర్షించాలనే లక్ష్యం సాధ్యమేనా?
అవును, కానీ ఇది కేవలం విధానాల వల్ల మాత్రమే సాధ్యపడదు. నివేదిక సూచించినట్లుగా, భారతీయ యూనివర్సిటీలు తమ అకాడమిక్ ప్రమాణాలను పెంచాలి, విదేశీ విద్యార్థులకు అవసరమైన ఆధునిక మౌలిక వసతులు, హాస్టల్ సౌకర్యాలను గణనీయంగా మెరుగుపరచాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


