ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల సమరానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
2 రోజులు షాపులు మూసివేత…

పోలింగ్‌కు 48 గంటల ముందే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అక్టోబర్ 28వ తేదీన పోలింగ్ జరగనుండగా.. 30వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు ఉండవు. ఈ మేరకు రెండు రోజుల పాటు మద్యం షాపులు ఏవీ తెరవకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏవైనా ఎన్నికలు జరిగే సమయంలో ఆయా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు అధికారులు మూసివేస్తారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఆదేశాలను ఏమాత్రం ఉల్లంఘించినా లేదా దొంగచాటుగా మద్యం విక్రయాలు జరిపినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. అక్రమ మద్యం రవాణా, నిల్వలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో కూడా గస్తీని పెంచి, ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీసు శాఖతో కలిసి ఎక్సైజ్ యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది.
రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో మద్యం షాపులన్నీ మూతపడనున్నాయి. సాధారణ వైన్ షాపులతో పాటు క్లబ్‌లు, పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్ల వంటివన్నీ కూడా క్లోజ్ అవుతాయి.
మరోవైపు ఆదివారంతో మేయర్, మున్సిపల్ ఛైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు నామినేషన్లు ముగిశాయి. మొత్తం 3 రోజుల్లో కలిపి మేయర్ స్థానాలకు మొత్తం 330, మున్సిపల్ ఛైర్మన్ స్థానాలకు 1,038 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. కార్పొరేటర్ స్థానాలకు 8,198, కౌన్సిలర్ స్థానాలకు 16,253 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా మూడు రోజుల్లో అన్నింటికీ కలిపి 25,819 నామినేషన్లు వేశారు. సోమవారం నామినేషన్ల పునఃపరిశీలన (స్క్రూట్నీ), 21న ఉపసంహరణల అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు.
{{/usCountry}}మరోవైపు ఆదివారంతో మేయర్, మున్సిపల్ ఛైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు నామినేషన్లు ముగిశాయి. మొత్తం 3 రోజుల్లో కలిపి మేయర్ స్థానాలకు మొత్తం 330, మున్సిపల్ ఛైర్మన్ స్థానాలకు 1,038 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. కార్పొరేటర్ స్థానాలకు 8,198, కౌన్సిలర్ స్థానాలకు 16,253 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా మూడు రోజుల్లో అన్నింటికీ కలిపి 25,819 నామినేషన్లు వేశారు. సోమవారం నామినేషన్ల పునఃపరిశీలన (స్క్రూట్నీ), 21న ఉపసంహరణల అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు.
{{/usCountry}}