ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ఆరోగ్య మిషన్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 20వ తేదీలోపు సంబంధిత కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలి. డేటా మేనేజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మైక్రోబయాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లు, ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును భట్టి అర్హతలు ఉంటాయి.

జీతం విషయానికి వస్తే.. డేటా మేనేజర్లు పోస్టుకు రూ.36,225, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.18,450, మైక్రోబయాలజిస్ట్ పోస్టుకు రూ.45,282, ల్యాబ్ టెక్నీషియన్లకు రూ.23,393, ల్యాబ్ అసిస్టెంట్ రూ.15,000 వేతనం చెల్లిస్తారు. ప్రస్తుతం ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ నేషనల్ హెల్త్ మిషన్ కింద చిత్తూరు జిల్లాలో జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం నుండి కాంట్రాక్ట్ ప్రాతిపదికన విడుదలైంది.
ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో జాతీయ ఆరోగ్య మిషన్‌లో ఖాళీగా ఉన్న డేటా మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మైక్రో బయాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 , ల్యాబ్ అటెండెంట్ పోస్టులు భర్తీ చేస్తారు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు DM&HO, Chittoor పేరు మీద చెల్లుబాటు అయ్యేలా ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీసి అప్లికేషన్‌కు జతపరచాలి. చిత్తూరు జిల్లా వైద్యారోగ్య శాఖ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు.. తమ దరఖాస్తులను ఫిబ్రవరి 20వ తేదీలోపు అప్లై చేయాలి. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను రాత పరిక్షలేకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా సెలక్ట్ చేస్తారు.
జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి, చిత్తూరు కార్యాలయానికి అభ్యర్థి వెళ్లి అప్లికేషన్ స్వయంగా అందజేయాలి. అప్లికేషన్‌కు జతచేయాల్సిన డాక్యుమెంట్స్ : నింపిన దరఖాస్తు ఫారానికి తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో అతికించాలి. ఎస్ఎస్సీ (లేదా) సమానమైన సర్టిఫికెట్ మార్కుల మెమో కాపీ జతపరచాలి. అర్హత పొందిన అన్ని సంవత్సరాల మార్కుల మెమోల ధృవీకరించిన కాపీలు జత చేయాలి. తాత్కాలిక / శాశ్వత అర్హత సర్టిఫికేట్ ధృవీకరించబడిన కాపీలు జతపరచాలి.
{{/usCountry}}జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి, చిత్తూరు కార్యాలయానికి అభ్యర్థి వెళ్లి అప్లికేషన్ స్వయంగా అందజేయాలి. అప్లికేషన్‌కు జతచేయాల్సిన డాక్యుమెంట్స్ : నింపిన దరఖాస్తు ఫారానికి తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో అతికించాలి. ఎస్ఎస్సీ (లేదా) సమానమైన సర్టిఫికెట్ మార్కుల మెమో కాపీ జతపరచాలి. అర్హత పొందిన అన్ని సంవత్సరాల మార్కుల మెమోల ధృవీకరించిన కాపీలు జత చేయాలి. తాత్కాలిక / శాశ్వత అర్హత సర్టిఫికేట్ ధృవీకరించబడిన కాపీలు జతపరచాలి.
{{/usCountry}}తాజా కుల ధృవీకరణ పత్రం, అభ్యర్థి చదివిన తరగతి-IV నుండి X వరకు అధ్యయన ధృవీకరణ పత్రాల ధృవీకరించిన కాపీలు జత చేయాలి. శారీరకంగా వికలాంగుల సర్టిఫికేట్, మాజీ సైనికులు (వర్తిస్తే) కూడా ఉంటే అందజేయాలి. అనుభవ ధృవీకరణ పత్రం, ఆధార్ కాపీతోపాటుగా ఏదైనా జాతీయ బ్యాంకు నుండి తీసుకున్న 500 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ ను జత పరచాలి.
ఈ లింక్ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదవండి.