ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీ ఓఎస్ఎస్) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 2వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను తాజాగా విడుదల చేశారు.
ఓపెన్ ఇంటర్ హాల్ టికెట్లు - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- అభ్యర్థులు ముందుగా https://portal.apopenschool.org/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని ఏపీ ఓఎస్ఎస్ ఇంటర్ హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ జిల్లా, స్కూల్, విద్యార్థి పేరును నమోదు చేయాలి.
- డౌన్లోడ్ హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

ఏపీ ఓపెన్ ఇంటర్ పరీక్షలు మార్చి 2 నుంచి ప్రారంభమవుతాయి. మార్చి 13వ తేదీతో అన్ని పరీక్షలు ముగుస్తాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఏపీ ఓఎస్ఎస్ ఆదేశించింది.
పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘా వంటి పలు చర్యలు తీసుకోనున్నారు. ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా పరీక్షలకు పకడ్భందీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వేసవి దృష్ట్యా… విద్యార్ధులకు అవసరమైన తాగునీరుతో పాటు మౌలిక సదుపాయాలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఏపీ ఓఎస్ఎస్ సూచించింది. ఎగ్జామ్ సెంటర్ల వద్ద నో సెల్ ఫోన్ జోన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తారు.