AP Open Inter Exams : ఏపీ ఓపెన్ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ ఓపెన్ ఇంటర్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పరీక్ష కోసం దరఖాస్తు చేసున్న అభ్యర్థులు https://portal.apopenschool.org/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి.

Published on: Feb 21, 2026, 10:30:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీ ఓఎస్ఎస్) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ పరీక్షలు మార్చి 2వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను తాజాగా విడుదల చేశారు.

ఏపీ ఓపెన్ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల
ఏపీ ఓపెన్ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల

ఓపెన్ ఇంటర్ హాల్ టికెట్లు - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

  1. అభ్యర్థులు ముందుగా https://portal.apopenschool.org/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని ఏపీ ఓఎస్ఎస్ ఇంటర్ హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ జిల్లా, స్కూల్, విద్యార్థి పేరును నమోదు చేయాలి.
  4. డౌన్లోడ్ హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

ఏపీ ఓపెన్ ఇంటర్ పరీక్షలు మార్చి 2 నుంచి ప్రారంభమవుతాయి. మార్చి 13వ తేదీతో అన్ని పరీక్షలు ముగుస్తాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఏపీ ఓఎస్ఎస్ ఆదేశించింది.

పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘా వంటి పలు చర్యలు తీసుకోనున్నారు. ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా పరీక్షలకు పకడ్భందీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వేసవి దృష్ట్యా… విద్యార్ధులకు అవసరమైన తాగునీరుతో పాటు మౌలిక సదుపాయాలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఏపీ ఓఎస్ఎస్ సూచించింది. ఎగ్జామ్ సెంటర్ల వద్ద నో సెల్ ఫోన్ జోన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More