AP Open SSC Hall Ticket 2026 : ఏపీ ఓపెన్ టెన్త్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
AP Open SSC Hall Tickets 2026 : ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://portal.apopenschool.org/ వెబ్ సైట్ నుంచి వీటిని విడుదల చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీ ఓఎస్ఎస్) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఏపీ ఓపెన్ టెన్త్ హాల్ టికెట్లు - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- అభ్యర్థులు ముందుగా https://portal.apopenschool.org/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఆఫ్ ఎస్ఎస్ సీ - మార్చి 2026 లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ జిల్లా, స్కూల్, విద్యార్థి పేరును నమోదు చేయాలి.
- డౌన్లోడ్ హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
ఏపీ ఓపెన్ టెన్త్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఉదయం 9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు నిర్వహిస్తారు.
- 16-03-2026205 - తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం.
- 18-03-2026202 - ఇంగ్లీష్.
- 21-03-2026211 - గణితం, భారతీయ సంస్కృతి వారసత్వం.
- 23-03-2026212 - శాస్త్ర మరియు సాంకేతిక విజ్ఞానం, గృహవిజ్ఞాన శాస్త్రం.
- 25-03-2026213 - సాంఘిక శాస్త్రం,ఆర్ధిక శాస్త్రం.
- 28-03-2026201 - హిందీ.
హాల్ టికెట్ లో నిర్దేశించిన సబ్జెక్టులు కాక వేరొక సబ్జెక్టులలో పరీక్ష రాసినచో అట్టి పరీక్షలు రద్దు చేయబడుతాయని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రములో సరియైన ప్రశ్నాపత్రం విధిగా పొందాలని…. ఇతర ప్రశ్నాపత్రంలో పరీక్ష రాసినచో ఫలితం రద్దు చేస్తామని పేర్కొన్నారు. విద్యార్ధికి నిర్దేశించిన పరీక్షా కేంద్రములో కాక వేరొక కేంద్రములో పరీక్షకు హాజరైనచో అలాంటి పరీక్షలను కూడా పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

