AP SSC Exams 2026 : ఏపీ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్ - హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ జర్నీ..!

ఏపీలో టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. హాల్ టికెట్ చూపిస్తే… ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించనుంది.

Published on: Mar 5, 2026, 18:53:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ అవకాశం ఉండనుంది. హాల్ టికెట్లను కండక్టర్లకు చూపిస్తే… ఫ్రీగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చు. తగినన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు.

AP SSC Exams 2026 : హాల్‌ టికెట్‌ చూపిస్తే.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
AP SSC Exams 2026 : హాల్‌ టికెట్‌ చూపిస్తే.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు దూరం ఉన్న చోట విద్యార్థుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులను నడిపాలని ఆర్టీసీ ఆదేశాలను జారీ చేసింది. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కేవలం పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ఈనెల 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఏపీ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరంతా కూడా ఫ్రీ జర్నీ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

AP SSC 2026 పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 1, 2026 వరకు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతుంది. పాఠశాలలు, ప్రైవేట్ అభ్యర్థులు హాల్ టిక్కెట్లను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని, పరీక్షలు ప్రారంభమయ్యే ముందు విద్యార్థులు వాటిని పొందేలా చూసుకోవాలని అధికారులు సూచించారు.

హాల్ టికెట్‌లో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, పాఠశాల పేరు, పరీక్షా కేంద్రం, సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలు, పరీక్ష సూచనలు వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి. విద్యార్థులు అన్ని సమాచారాన్ని జాగ్రత్తగా ధృవీకరించాలని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే వారి పాఠశాలకు తెలపాలి. తప్పులు ఏమైనా ప్రింట్ అయితే అవసరమైన చర్యలు పాఠశాల తీసుకుంటుంది.

AP SSC హాల్ టికెట్ - డౌన్లోడ్ ఇలా:

  • అధికారిక వెబ్‌సైట్‌ bse.ap.gov.in. ను సందర్శించండి:
  • హోమ్‌పేజీలో “AP SSC హాల్ టికెట్ 2026” లింక్‌పై క్లిక్ చేయండి.
  • యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
  • క్యాప్చా వెరిఫికేషన్‌ను పూర్తి చేయండి, వివరాలను సమర్పించండి.
  • హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ చేయండి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More