ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సీఎస్ సాయి ప్రసాద్, ఆర్ధిక, రెవెన్యూ, ఎక్సైజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, గనులు, రవాణా, పురపాలక, పంచాయితీరాజ్ శాఖల ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు స్పెషల్ మార్జిన్‌తో కలిపి రూ.74,342 కోట్లకు రాష్ట్ర సొంత ఆదాయం చేరింది.

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.11,738 కోట్లు అదనంగా ఆదాయ ఆర్జన వచ్చింది. మొత్తంగా చూసుకుంటే.. 18.7 శాతం వృద్ధి నమోదైంది. స్పెషల్ మార్జిన్‌తో కలిపి రాష్ట్ర సొంత ఆదాయం గత ఏడాది ఇదే సమయానికి రూ.62,604 కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఏడాదిలో రూ.74,342 కోట్లకు పెరిగింది రాష్ట్ర సొంత ఆదాయం.
రూ.1,27,506 కోట్ల వార్షిక లక్ష్యంలో నవంబర్ 23 నాటికే 58 శాతం సాధించినట్లు అధికారులు వివరించారు. రూ.10,104 కోట్ల మేర పన్ను ఆదాయం పెరిగింది. గత ఏడాది ఇదే కాలానికి రూ.53,692 కోట్లు ఇది నమోదైంది. ఈ ఏడాది రూ.63,796 కోట్లకు పన్ను ఆదాయం చేరింది. పన్నుల ద్వార వచ్చే ఆదాయంలో 18.8 శాతం వృద్ధి నమోదవ్వగా.. పన్నేతర ఆదాయంలో 31.3 శాతం వృద్ధి ఉంది.
వాణిజ్య పన్నుల ఆదాయం 18.3 శాతం వృద్దితో రూ. 5,917 కోట్లకు పెరిగింది. 18.1 శాతం వృద్దితో రూ.3,694 కోట్ల మేర జీఎస్టీ ఆదాయం పెరిగింది. స్పెషల్ మార్జిన్‌తో కలిపి రూ.20,083 కోట్లకు ఎక్సైజ్ శాఖ ఆదాయం చేరింది. 19.6 శాతం వృద్ధితో గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.3,287 కోట్లు ఆదాయం పెరిగింది. 16.6 శాతం వృద్దితో రూ.8,020 కోట్లకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం చేరింది.
వాహనాల కొనుగోలు, రిజిస్ట్రేషన్లలో 17.3 శాతం పెరిగి రూ.3,649 కోట్లకు పన్నుల ఆదాయం చేరింది. 13.2 శాతం పెరిగి రూ. 2,086 కోట్లకు గనులు, భూగర్భ శాఖ ఆదాయం వచ్చింది. 22.3 శాతం పెరిగి రూ. 22 కోట్లకు అటవీ శాఖ ఆదాయం చేరుకుంది. రూ.1,330 కోట్ల నుంచి రూ.2,091 కోట్లకు పన్నేతర ఆదాయం పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 20 వరకు రూ.238 కోట్లకు పంచాయతీల పన్ను ఆదాయం చేరుకున్నది. ఈ ఏడాది నవంబర్ 20 వరకు రూ.2,365 కోట్ల మేర పట్టణ స్థానిక సంస్థల్లో పన్ను ఆదాయం వచ్చింది.
{{/usCountry}}వాహనాల కొనుగోలు, రిజిస్ట్రేషన్లలో 17.3 శాతం పెరిగి రూ.3,649 కోట్లకు పన్నుల ఆదాయం చేరింది. 13.2 శాతం పెరిగి రూ. 2,086 కోట్లకు గనులు, భూగర్భ శాఖ ఆదాయం వచ్చింది. 22.3 శాతం పెరిగి రూ. 22 కోట్లకు అటవీ శాఖ ఆదాయం చేరుకుంది. రూ.1,330 కోట్ల నుంచి రూ.2,091 కోట్లకు పన్నేతర ఆదాయం పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 20 వరకు రూ.238 కోట్లకు పంచాయతీల పన్ను ఆదాయం చేరుకున్నది. ఈ ఏడాది నవంబర్ 20 వరకు రూ.2,365 కోట్ల మేర పట్టణ స్థానిక సంస్థల్లో పన్ను ఆదాయం వచ్చింది.
{{/usCountry}}ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా లీకేజీలు తగ్గడం, వ్యవస్థీకృత లోపాలను సరిదిద్దడంలో ఆయా శాఖల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. 'రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు ఆదాయంలో ప్రతిఫలించాలి. పన్నుల భారం లేకుండా, కొత్తగా ఛార్జీలు పెంచకుండా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆదాయం పెంచేందుకు కృషి చేయాలి. పలు శాఖల్లో పారదర్శకత, ఆన్లైన్ విధానం, సంస్కరణల కారణంగా ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల కనిపించింది. పన్ను రిటర్నుల పరిశీలన, ఆడిట్, తనిఖీలు, న్యాయ వ్యవహారాల్లో ఏఐని వినియోగిస్తోంది.' అని చంద్రబాబు అన్నారు.
ABOUT THE AUTHOR
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.