శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.
Maruti Suzuki : షాకిచ్చిన మారుతీ సుజుకీ- వాహనాల ధరల పెంపు! ఏడాదిలో 4వ సారి..
కొత్త కారు కొనాలనుకునే సామాన్యులకు మారుతీ సుజుకీ షాక్ ఇచ్చింది. పెరుగుతున్న తయారీ వ్యయాల భారాన్ని తట్టుకోలేక ఎంపిక చేసిన కార్ల ధరలను పెంచింది. ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి కాగా, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
కొత్త కారు కొనాలని కలలు కంటున్న మధ్యతరగతి కుటుంబాలకు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ గట్టి షాక్ ఇచ్చింది! తమ లైనప్‌లోని ఎంపిక చేసిన కార్ల ధరలను పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ తాజా ధరల సవరణ నవంబర్ 22 నుంచే అమల్లోకి వచ్చింది. ముడిసరుకు, తయారీ వ్యయాలు నిరంతరం పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తప్పలేదని కంపెనీ స్పష్టం చేసింది. తాజా పెంపు వల్ల సంస్థ విక్రయించే కార్ల సగటు ధర (వాల్యూమ్-వెయిటెడ్ యావరేజ్) 0.31 శాతం మేర పెరగనుంది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటం, ఏడాది చివరి ఆఫర్ల కోసం చాలామంది ఎదురుచూస్తున్న తరుణంలో ధరలు పెరగడం స్థానిక కొనుగోలుదారులపై అదనపు భారం మోపనుంది.
ఏ మోడల్ ధర ఎంత పెరిగిందో ఇంకా స్పష్టత లేదు!
ఏ కారు మోడల్‌పై, ఏ వేరియంట్‌పై ఎంత మేర ధర పెంచామన్న కచ్చితమైన వివరాలను మారుతీ సుజుకీ ఇంకా బహిర్గతం చేయలేదు. కొనుగోలుదారులు ఎంచుకునే కారు మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెరుగుదలలో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.
పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల భారాన్ని తామే భరించేందుకు ఎంతో ప్రయత్నించామని, అయితే అనివార్య పరిస్థితుల్లో అందులో కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేయాల్సి వచ్చిందని కంపెనీ వివరించింది.
ఈ ఏడాదిలో నాలుగోసారి ధరల బాదుడు!
ఈ ఏడాదిలో మారుతీ సుజుకీ కార్ల ధరలను పెంచడం ఇది నాలుగోసారి. అంతకుముందు మూడు విడతల్లో చేసిన సవరణల వల్ల కంపెనీ కార్ల ధరలు ఇప్పటికే సగటున 1 శాతానికి పైగా పెరిగాయి. భారత ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో పండుగ సీజన్ పుణ్యమా అని భారీ డిమాండ్ నెలకొన్న సమయంలోనే ఈ తాజా పెంపు చోటుచేసుకుంది.
మారుతీ సుజుకీ లైనప్‌లోని పాపులర్ కార్లు ఇవే..
ఎంట్రీ లెవల్ కార్ల నుంచి ప్రీమియం ఎస్‌యూవీల వరకు మారుతీ సుజుకీ వద్ద విస్తృత శ్రేణి మోడళ్లు ఉన్నాయి. వీటిలో ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బలెనో, డిజైర్, బ్రెజా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఎర్టిగా వంటి ప్రముఖ కార్లు ఉన్నాయి. ఈ జాబితాలోని ఏయే మోడళ్లపై తాజా ధరల పెంపు ప్రభావం ఉంటుందో సంస్థ త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది.
గత కొన్ని నెలలుగా ఎస్‌యూవీలు, కాంపాక్ట్ కార్లకు ఉన్న బలమైన డిమాండ్‌తో మారుతీ సుజుకీ మెరుగైన అమ్మకాల గణాంకాలను నమోదు చేస్తోంది. మరోవైపు ముడిసరుకు ధరల పెరుగుదల ఆటోమొబైల్ తయారీ సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. ఈ ఆర్థిక భారాన్ని తట్టుకునేందుకు పలు ఇతర కార్ల కంపెనీలు కూడా ఈ ఏడాది తమ వాహనాల ధరలను సవరించాయి.
మారుతీ సుజుకీ మోడళ్ల వారీగా పెరిగిన కొత్త ధరల జాబితా త్వరలోనే వెలువడనుంది. కాబట్టి కారు బుక్ చేసుకునే ముందు సమీపంలోని డీలర్‌షిప్ వద్ద కొత్త ధరలను సరిచూసుకోవడం కొనుగోలుదారులకు శ్రేయస్కరం.

E-Paper
