...
...
Next Story

AP PGCET 2026 Updates : ఏపీ పీజీసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు - ముఖ్యమైన తేదీలు

AP Post Graduation Common Entrance Test - 2026 : ఏపీ పీజీ సెట్ - 2026 కు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఆన్ లైన్ దరఖాస్తుల గడువును పొడిగించారు. అర్హులైన విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా మార్చి 19వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

Published on: Mar 10, 2026 07:01 AM IST
Advertisement

ఏపీలో పీజీ చేరాలనుకుంటున్న విద్యార్థులకు మరో అప్డేట్ వచ్చింది. ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ - 2026 దరఖాస్తులను గడువును పొడిగించారు. ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం… మార్చి 9వ తేదీతో దరఖాస్తుల గడువు(లేట్ ఫీజు లేకుండా) పూర్తి అయింది. అయితే ఈ గడువు మార్చి 19వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ఏపీ పీజీసెట్ 2026 (image source istock)
ఏపీ పీజీసెట్ 2026 (image source istock)

పీ పీజీ సెట్ - 2026 నోటిఫికేషన్ లో భాగంగా 2026 -27 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో (PG Courses) ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూస్తోంది.

ముఖ్యమైన తేదీలు…

అర్హులైన విద్యార్థులు… మార్చి 19వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక రూ.1000 అపరాధ రుసుముతో మార్చి 23 వరకు, రూ.2000 అపరాధ రుసుముతో మార్చి 27 వరకు, రూ.4000 అపరాధ రుసుముతో మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది.

ఇక రూ.10,000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏపీ పీజీసెట్ 2026 కి సంబంధించిన ఆన్ లైన్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఏప్రిల్ 5వ తేదీన అందుబాటులోకి వస్తుంది. ఇక ఏప్రిల్ 20వ తేదీన హాల్ టికెట్లు విడుదలవుతాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 5 నుంచి 11వ తేదీల మధ్య ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.

ఏపీ పీజీసెట్ - 2026 రాతపరీక్షలో సాధించిన ర్యాంకుల ఆధారంనే ప్రవేశాలు కల్పిస్తారు. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు. ఫలితాల విడుదల తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే… స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను ప్రకటిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe