AP POLYCET 2026 : ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల - ఇలా దరఖాస్తు చేసుకోండి

AP POLYCET Notificcation 2026 : ఏపీ పాలిసెట్ - 2026 నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 4వ తేదీతో దరఖాస్తుల గడువు పూర్తవుతుంది.

Published on: Mar 05, 2026 3:15 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ నోటిఫికేషన్ జారీ అయింది. 2026 - 2027 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిప్లోమా సీట్లను భర్తీ చేస్తారు.

ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ 2026
ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ 2026

ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ - 2026లో భాగంగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 4వ తేదీతో గడువు పూర్తవుతుంది. అప్లికేషన్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 100గా నిర్ణయించారు.

ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా పాలిసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవటానికి అర్హులవుతారు.

ఏప్రిల్ 25న పాలిసెట్ ఎగ్జామ్….

ఏపీ పాలిసెట్ - 2026 పరీక్షలను ఏప్రిల్ 25వ తేదీ నిర్వహిస్తారు. అంతకంటే ముందే హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తారు. ఎగ్జామ్ నిర్వహణకు 7 రోజుల ముందు వీటిని విడుదల చేస్తారు. పరీక్ష పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత తుది కీలతో పాటు ఫలితాలను ప్రకటిస్తారు.

అభ్యర్థులు సాధించిన ర్యాంకులతో పాటు వారు ఎంచుకున్నవెబ్ ఆప్షన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులు టాప్ కాలేజీల్లో సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించి… అడ్మిషన్ల భర్తీని పూర్తి చేస్తారు.

ఏపీ పాలిసెట్ - అప్లికేషన్ ప్రాసెస్

  1. ముందుగా https://polycetap.ap.gov.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి,
  2. హోం పేజీలోని ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
  3. మొబైల్ నెంబర్ లేదా పదో తరగతి హాల్ టికెట్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.
  4. ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
  5. మీ వివరాలను నమోదు చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి.
  6. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫారమ్ ను పొందొచ్చు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More