...
...
Next Story

AP PGECET 2026 : ఏపీ పీజీఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. ఇలా రిజల్ట్ చెక్ చేసుకోండి

AP PGECET 2026 : ఏపీ పీజీఈసెట్ 2026 ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు నేరుగా రిజల్ట్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ మీ కోసం డైరెక్ట్ లింక్ ఉంది.

Published on: May 14, 2026, 15:20:30 IST
Advertisement

ఏపీ పీజీఈసెట్-2026 ఫలితాలను అధికారులు బుధవారం విడుదల చేశారు. ఈ ఏడాది కూడా అభ్యర్థులు మంచి ప్రతిభ కనబరిచారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఈ ఫలితాలను ప్రకటిస్తూ, అర్హత సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీ పీజీఈసెట్ 2026 ఫలితాలు విడుదల
ఏపీ పీజీఈసెట్ 2026 ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(APSCHE), APPGECET-2026 పరీక్ష నిర్వహణ బాధ్యతను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 పరీక్షా కేంద్రాలలో ఏప్రిల్ 28 నుండి 30, 2026 తేదీల మధ్య ఆరు విడతలుగా ఈ పరీక్ష విజయవంతంగా జరిగింది.

APPGECET-2026కు దరఖాస్తు చేసుకున్న మొత్తం అభ్యర్థుల సంఖ్య 12102గా ఉంది. పరీక్షకు 9990 మంది హాజరయ్యారు. 9320 అభ్యర్థులు అర్హత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థుల శాతం 93.29 శాతంగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం 94.17 ఉత్తీర్ణత శాతంతో టాప్‌లో ఉంది. విజయనగరం 92.88 శాతంతో చివరలో ఉంది.

ఫలితాలను ఎలా చూసుకోవాలి?

అభ్యర్థులు తమ ఫలితాలను మరియు ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుండి సులభంగా పొందవచ్చు:

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in సందర్శించండి.
  • హోమ్ పేజీలో 'APPGECET-2026 Results లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి.
  • వ్యూ రిజల్ట్స్ మీద క్లిక్ చేయాలి. ఫలితాలు కనిపిస్తాయి.

ఈ లింక్ క్లిక్ చేసి నేరుగా ఫలితాలు చూసుకోవచ్చు.

భవిష్యత్తు అవసరాల కోసం దానిని ప్రింట్ తీసుకుని దగ్గర ఉంచుకోండి.

ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థులు తదుపరి దశ అయిన కౌన్సెలింగ్‌కు సిద్ధం కావాల్సి ఉంటుంది. జూలై, ఆగస్టులో జరగవచ్చు. ప్రవేశాల సమయంలో ర్యాంక్ కార్డు అత్యంత కీలకం. ఇందులో అభ్యర్థి సాధించిన మార్కులు, ర్యాంక్, పర్సంటైల్ వివరాలు ఉంటాయి.

త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కానుంది. అభ్యర్థులు తమ విద్యా ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks