...
...
Next Story

AP Police Ganesh Chaturthi Permissions : వినాయక మండపాల అనుమతులు - ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభం, ఉచితంగానే పర్మిషన్

AP Ganesh Chaturthi Permissions : ఏపీలో వినాయక చవితి మండపాల అనుమతుల కోసం పోలీసులు 'www.ganeshutsav.net' అనే సింగిల్ విండో ఈ-పోర్టల్‌ను తీసుకొచ్చారు. విద్యుత్, అగ్నిమాపక, మున్సిపల్ శాఖల ఆమోదం కూడా ఉచితంగానే పొందవచ్చు.

Published on: Sep 3, 2026, 13:59:25 IST
Advertisement

AP Ganesh Chaturthi Permissions : వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు ఏపీ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్సవ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ఇకపై అధికారుల చుట్టూ, వివిధ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే సులువుగా అనుమతులు పొందేలా ఒక ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా వెల్లడించారు.

వినాయక మండపాల అనుమతులకు ఆన్ లైన్ పోర్టల్
వినాయక మండపాల అనుమతులకు ఆన్ లైన్ పోర్టల్

మండపాల ఏర్పాటుకు 'www.ganeshutsav.net' అనే సింగిల్ విండో ఈ-పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి విడివిడిగా అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. కానీ, ఈ కొత్త విధానంతో ఒక్క దరఖాస్తుతోనే అన్ని శాఖల ఆమోదం లభిస్తుంది.

క్యూఆర్ కోడ్ పర్మిషన్….

ముఖ్యంగా పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్ మరియు రెవెన్యూ శాఖల సమన్వయంతో ఈ అనుమతుల ప్రక్రియను నిర్వహించనున్నారు. దరఖాస్తును పరిశీలించిన అనంతరం అధికారుల ఆమోదంతో క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ అనుమతి పత్రాన్ని నిర్వాహకులు ఆన్‌లైన్ నుంచే నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పూర్తిగా ఉచితం….

ఈ ఆన్‌లైన్ సేవను ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. దరఖాస్తు కోసం నిర్వాహకులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు సురక్షితమైన, ప్రశాంతమైన మరియు క్రమబద్ధమైన వాతావరణంలో జరిగేలా చూడటానికే ఈ ఏకీకృత అనుమతి వ్యవస్థను తీసుకొచ్చినట్లు పోలీస్ శాఖ తెలిపింది.

నిర్వాహకులందరూ ఈ ఆన్‌లైన్ వెబ్‌సైట్ సదుపాయాన్ని ఉపయోగించుకుని, ముందస్తుగానే దరఖాస్తులు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. "సురక్షితమైన వేడుకలు – బాధ్యతాయుతమైన వేడుకలు" నిర్వహించడంలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పిలుపునిచ్చింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks