AP Police Recruitment : ఏపీ పోలీస్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు - నెలకు రూ.45 వేల జీతం, దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!
AP Police Outsourcing Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మంగళగిరిలోని టెక్నికల్ సర్వీసెస్ విభాగంలో 20 ఐటీ, టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫ్‌లైన్ దరఖాస్తుకు సెప్టెంబర్ 30 తుది గడువుగా నిర్ణయించారు.
AP Police Outsourcing Recruitment 2026 : కంప్యూటర్ డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి మంచి శుభవార్త అందింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్, మంగళగిరి పరిధిలోని టెక్నికల్ సర్వీసెస్ విభాగంలో ఒప్పంద / ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసేందుకు పలు టెక్నికల్, కస్టమర్ సపోర్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 20 ఖాళీల నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఖాళీల వివరాలు…
- కస్టమర్ సపోర్ట్ పర్సనల్ (పోస్ట్ కోడ్ 01) : 16 పోస్టులు. నెలకు వేతనం రూ. 19,000.
- నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ (పోస్ట్ కోడ్ 02) : 01 పోస్ట్. నెలకు వేతనం రూ. 45,000.
- డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ (పోస్ట్ కోడ్ 03) : 01 పోస్ట్. నెలకు వేతనం రూ. 45,000.
- మొబైల్ అప్లికేషన్ డెవలపర్ (పోస్ట్ కోడ్ 04) : 01 పోస్ట్. నెలకు వేతనం రూ. 45,000.
- వెబ్ అప్లికేషన్ డెవలపర్ (పోస్ట్ కోడ్ 05) : 01 పోస్ట్. నెలకు వేతనం రూ. 45,000.
కస్టమర్ సపోర్ట్ పర్సనల్ లకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఫస్ట్ క్లాస్ (మొదటి శ్రేణి) మార్కులతో కంప్యూటర్ సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
టెక్నికల్ పోస్టులకు కంప్యూటర్ సైన్స్ (CSE) లేదా ఐటీ (CS-IT) విభాగంలో ఫస్ట్ క్లాస్‌తో బి.టెక్ లేదా బీఈ పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు ఆయా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌లో పేర్కొన్న రియల్ టైమ్ ప్రాజెక్ట్ అనుభవం మరియు గ్లోబల్ సర్టిఫికేషన్లు (CCNP, CISSP, Oracle, Microsoft, Zend మొదలైనవి) తప్పనిసరిగా ఉండాలి.
01 జూలై 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే 02 జూలై 1984 నుండి 01 జూలై 2008 మధ్య జన్మించిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC) వర్గాలకు చెందిన అభ్యర్థులకు వయోపరిమితిలో 5 సంవత్సరాల మినహాయింపు (అనగా 47 ఏళ్ల వరకు) ఉంటుంది.
- కస్టమర్ సపోర్ట్ పర్సనల్ పోస్టులకు 50 మార్కులకుగానూ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహిస్తారు. సమయం 30 నిమిషాలు. ఇందులో MS-Word, MS-Excel, MS-PowerPoint, ఇంటర్నెట్, ఈ-మెయిల్ వినియోగంపై ప్రశ్నలు ఉంటాయి. అలాగే నిమిషానికి కనీసం 30 పదాల (30 WPM) టైపింగ్ వేగం ఉందో లేదో పరిశీలిస్తారు.
- టెక్నికల్ పోస్టులకు 100 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో (MCQ) రాత పరీక్ష నిర్వహి్తారు. పరీక్ష సమయం 90 నిమిషాలు (1 గంట 30 నిమిషాలు).
దరఖాస్తు విధానం…
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ( https://appolice.gov.in/ ) నుంచి దరఖాస్తు నమూనాను (Annexure-I) డౌన్‌లోడ్ చేసుకుని, వివరాలన్నీ జాగ్రత్తగా భర్తీ చేయాలి. భర్తీ చేసిన దరఖాస్తుతో పాటు విద్యార్హతలు, కుల ధృవీకరణ పత్రాలు, అనుభవ సర్టిఫికెట్లు, సెల్ఫ్ అడ్రస్ రాసిన రెస్పాన్స్ పోస్టల్ కవర్ వంటి పత్రాలను జతచేసి ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా కేవలం స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. చేతితో నేరుగా ఇచ్చే దరఖాస్తులను స్వీకరించరు.
- దరఖాస్తు పంపాల్సిన చిరునామా : ఏఏవో, O/o ఐజీపీ, టెక్నికల్ సర్వీసెస్, ఏపీ పోలీస్ టెక్ టవర్స్, AP Police Hqrs. మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ - 522503.
- దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : 30 సెప్టెంబర్ 2026 (సాయంత్రం 5:00 గంటలలోపు)
- అధికారిక వెబ్ సైట్ - https://appolice.gov.in/
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

