TG DOST Spot Admission : డిగ్రీ ప్రవేశాలపై కొత్త అప్డేట్ - ప్రత్యేక స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల, పూర్తి వివరాలు ఇవే
TG DOST Spot Admission 2026 : తెలంగాణ డిగ్రీ కళాశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి దోస్త్ ప్రత్యేకం స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 23న ఖాళీల వివరాల ప్రకటన…. 24, 25 తేదీల్లో అడ్మిషన్లు నిర్వహించనున్నారు.
TG DOST Spot Admission 2026 :రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఉన్నత విద్యామండలి మరో అవకాశం కల్పించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రత్యేకంగా దోస్త్ స్పాట్ అడ్మిషన్లను చేపట్టనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.

సెప్టెంబర్ 23న అన్ని కళాశాలల నోటీసు బోర్డులలో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను ప్రదర్శిస్తారు. విద్యార్థులు నేరుగా సంబంధిత కళాశాలల్లో గానీ లేదా దోస్త్ అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ లో గానీ ఖాళీల వివరాలను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.
స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ….
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలు, ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలు (రెగ్యులర్ కోర్సులు), ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్ కళాశాలల్లో (రెగ్యులర్ కోర్సులు) సెప్టెంబర్ 24, 25 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. స్పాట్ రౌండ్‌లో ప్రవేశం పొందిన విద్యార్థుల వివరాలను ఆయా విద్యాసంస్థలు సెప్టెంబర్ 26న దోస్త్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇక అన్ని రకాల విద్యాసంస్థల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఆఖరి విడతగా ప్రత్యేక స్పాట్ అడ్మిషన్లు చేపడతారు. ఈ ప్రవేశాల్లో స్థానిక విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాతే మిగిలిన సీట్లను నాన్-లోకల్ అభ్యర్థులకు కేటాయిస్తారు. ప్రవేశాలు పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

