AP Degree Amissions 2026 : ఏపీలో డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ అప్డేట్ - రెండో విడత వెబ్ ఆప్షన్లు ప్రారంభం

AP Degree Admissions 2026 : ఏపీలో డిగ్రీ ప్రవేశాల రెండో విడత కౌన్సెలింగ్ కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ల గడువు ముగియగా... తాజాగా వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. https://cap.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

Published on: Sep 22, 2026, 06:02:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Degree Admissions 2026 : రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఆన్‌లైన్ కౌన్సెలింగ్ రెండో విడత కొనసాగుతోంది. ఇప్పటికే నమోదు ప్రక్రియ పూర్తవ్వగా, ఉన్నత విద్యామండలి తాజాగా వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యర్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ cap.apcfss.in ను సందర్శించి ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ - వెబ్ ఆప్షన్లు షురూ
డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ - వెబ్ ఆప్షన్లు షురూ

రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కోసం ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా హెల్ప్ లైన్ సెంటర్లను (HLCs) ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్ లేదా హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా జరిగే ఈ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ సెప్టెంబర్ 24వ తేదీ వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు తమ పత్రాలను సరిగ్గా సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈనెల 23 వరకు వెబ్ ఆప్షన్లు….

రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు (వెబ్ ఆప్షన్లు నమోదు) సెప్టెంబర్ 23 వరకు అవకాశం కల్పించారు. ఒకవేళ ఎంచుకున్న వెబ్ ఆప్షన్లలో మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకుంటే సెప్టెంబర్ 24న ఎడిట్ చేసుకోవచ్చు.

వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం, అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సెప్టెంబర్ 27న సీట్ల కేటాయింపు (అలాట్‌మెంట్) ఫలితాలను వెల్లడిస్తారు. సీటు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 28 నుంచి సెప్టెంబర్ 30 తేదీల మధ్య తమకు కేటాయించిన కళాశాలల్లో నేరుగా హాజరై, సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా రిపోర్ట్ చేయని వారి సీటు రద్దయ్యే అవకాశం ఉంది.

ముఖ్యమైన తేదీలు…

  • హెచ్‌ఎల్‌సీ ద్వారా ప్రమాణపత్రాల పరిశీలన: సెప్టెంబర్ 24, 2026 వరకు
  • వెబ్ ఆప్షన్ల నమోదు: సెప్టెంబర్ 23, 2026 వరకు అవకాశం ఉంది.
  • వెబ్ ఆప్షన్ల మార్పుకు అవకాశం: సెప్టెంబర్ 24, 2026
  • సీట్ల కేటాయింపు (అలాట్‌మెంట్): సెప్టెంబర్ 27, 2026
  • కళాశాలల్లో రిపోర్టింగ్: సెప్టెంబర్ 28 నుండి సెప్టెంబర్ 30, 2026
  • అధికారిక వెబ్ సైట్ - https://cap.apcfss.in/
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More