...
...
Next Story

AP POLYCET 2026 Counselling : ఏపీ పాలిసెట్ ప్రవేశాలు - ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు, ముఖ్య సమాచారం

AP POLYCET 2026 Counselling : ఏపీ పాలిసెట్ 2026 మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ గడువును పొడిగించారు. రిజిస్ట్రేషన్ (స్లాట్ బుకింగ్) గడువు నేటితో పూర్తవుతుంది. జూలై 7వ తేదీన మొదటి విడత సీట్లను కేటాయిస్తారు.

Published on: Jul 2, 2026, 15:33:38 IST
Advertisement

AP POLYCET 2026 Counselling : పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'ఏపీ పాలిసెట్ 2026' మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న మొదటి విడత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ మరియు ఫీజు చెల్లింపు ప్రక్రియ ఇవాళ్టితో (02.07.2026) ముగియనుంది. నిజానికి ఈ గడువు జూన్ 30వ తేదీతో పూర్తి అయినప్పటికీ…. విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జూలై 2 వరకు పొడిగించారు. ఈ మేరకు అధికారులు కొత్త షెడ్యూల్ ను ప్రకటించారు.

గడువు పొడిగింపు - ముఖ్యమైన తేదీలు….

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ 2026
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ 2026

తాజా షెడ్యూల్ ప్రకారం…. జూలై 2, 2026తో స్లాట్ బుకింగ్ గడువు ముగుస్తుంది. అర్హులైన అభ్యర్థులు https://polycet.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇక ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లు వెరిఫై కాని వారు లేదా వివరాల్లో మార్పులు చేసుకోవాలనుకునే విద్యార్థులు జూలై 3, 2026 వరకు హెల్ప్‌లైన్ సెంటర్లలో (HLC) నేరుగా పత్రాల పరిశీలన చేయించుకోవచ్చు.

ఇక పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను జూన్ జూలై 4, 2026 వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేయాలనుకుంటే జూలై 5వ తేదీన ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు. వీటన్నింటినీ క్రోడీకరించి జూలై 7, 2026న మొదటి విడత సీట్ల కేటాయింపు (Seat Allotment) ఫలితాలను విడుదల చేస్తారు.

సీట్లు పొందిన విద్యార్థులు జూలై 8 నుంచి జూలై 11వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు, ఆయా కాలేజీల్లో నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాగా…. పాలిటెక్నిక్ కాలేజీల క్లాస్ వర్క్ జూలై 8 నుంచే ప్రారంభం కానుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks