AP POLYCET 2026 Counseling : ఏపీ పాలిసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి - అలాట్ మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
AP POLYCET Counseling : ఆంధ్రప్రదేశ్‌లోని పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండో విడత(ఫైనల్ ఫేజ్) సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 55 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. https://polycet.ap.gov.in/ నుంచి అలాట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP POLYCET Counseling 2026 : పాలిటెక్నిక్ కళాశాలల్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఏపీ పాలిసెట్ (AP POLYCET) రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ప్రక్రియను సోమవారం విజయవంతంగా పూర్తి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల గణాంకాలను పరిశీలిస్తే…. ప్రస్తుతం 55 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 257 పాలిటెక్నిక్ కళాశాలలు అందుబాటులో ఉండగా, వీటిలో కన్వీనర్ కోటా కింద మొత్తం 79,873 సీట్లు కేటాయించారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా ఇప్పటివరకు 44,254 సీట్లు భర్తీ కాగా…. ఇంకా 35,619 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఇక ఫైనల్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు…. ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్, సెల్ఫ్ జాయినింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఏడాది నిర్వహించిన ఏపీ పాలిసెట్ ప్రవేశ పరీక్షలో మొత్తం 1,48,951 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వారిలో 46,578 మంది మాత్రమే కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తుది పరిశీలన అనంతరం వీరిలో 45,748 మంది అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అర్హత పొందారు. దీంతో భారీగానే సీట్లు మిగిలిపోయాయి.
అలాట్‌మెంట్ డౌన్లోడ్ విధానం:
ఏపీ పాలిసెట్ ఫైనల్ ఫేజ్ లో సీటు పొందిన అభ్యర్థులు తమ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను ఆన్‌లైన్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://polycet.ap.gov.in ను సందర్శించాలి.
- హోమ్ పేజీలో కనిపించే 'Login' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- మీ పాలిసెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- వివరాలు నమోదు చేశాక 'సబ్మిట్ ' బటన్‌పై క్లిక్ చేస్తే స్క్రీన్‌పై మీ సీటు కేటాయింపు వివరాలు కనిపిస్తాయి.
- భవిష్యత్ అవసరాల కోసం ఆ కాపీని ప్రింట్ లేదా డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం వర్తిస్తుంది. అయితే దీనికి సంబంధించి వయోపరిమితి నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. జూలై 1, 2026 నాటికి ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC) వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 24 ఏళ్లుగా నిర్ణయించారు. అలాగే ఓసీ (OC) అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 20 ఏళ్లుగా ఉంది. ఈ వయోపరిమితి ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

