బంగాళాఖాతంలో వాయుగుండం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు!

వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో ఇది తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో ఏపీ, తెలంగాణలో వానలు పడనున్నాయి.

Published on: Jul 26, 2026, 18:05:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రాబోయే 24 గంటల కాలంలో తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ తీవ్ర వాయుగుండం సోమవారం నాటికి ఒడిశాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపాల మధ్య తీరాన్ని దాటే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

ఏపీ, తెలంగాణ వర్షాలు
ఏపీ, తెలంగాణ వర్షాలు

వాయుగుండం తీరం వైపు పయనిస్తున్న కొద్దీ దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలపై స్పష్టంగా కనిపించనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుండి 65 కిలోమీటర్ల వేగంతో, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్నందున తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. మిగిలిన కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాతావరణ మార్పుల ప్రభావం తెలంగాణపై కూడా ఉండనుంది. రాగల రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్టుగా వెదర్ మ్యాన్ అంచనా వేశారు. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటుగా ఉత్తర తెలంగాణ జిల్లా్ల్లో కూడా వర్షాలు పడనున్నాయి. అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉంది.

హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడ చినుకులు లేదా మోస్తరు వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఉపరితల గాలులు బలంగా వీచే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణాలు చేసే వారు, లోతట్టు ప్రాంతాల నివాసితులు వాతావరణ హెచ్చరికలను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More