ఏపీపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం - ఈ జిల్లాలకు వర్ష సూచన!

బంగాళాఖాతంలో ద్రోణి, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు APSDMA తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.

Published on: Oct 14, 2026, 06:47:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణికి తోడు ఈశాన్య రుతుపవనాల ప్రభావం తోడవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ జిల్లాలకు వర్ష సూచన
ఈ జిల్లాలకు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటనలోని వివరాల ప్రకారం…. ముఖ్యంగా పిడుగులు పడే తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇవాళ (అక్టోబర్ 14, 2026) రోజున రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుసే సూచనలున్నాయి.

ఈ జిల్లాలకు వర్ష సూచన…

ప్రధానంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే సూచనలున్నాయి.

పిడుగుపాటు ప్రమాదం పొంచి ఉన్నందున వర్షం కురిసే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండే ప్రజలు, రైతులు, పశువుల కాపరులు తీవ్ర జాగ్రత్తలు వహించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.

  • వర్షం పడుతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లు, కరెంట్ స్తంభాలు, ఇనుప స్తంభాలు లేదా భారీ హోర్డింగ్స్ కింద నిలబడవద్దు.
  • పొలాల్లో పనిచేసే రైతులు, శ్రామికులు సురక్షితమైన పక్కా భవనాల్లో ఆశ్రయం పొందాలి.
  • ప్రయాణాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉంటూ, ఉరుములు మెరుపులు ప్రారంభమైనప్పుడు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉంటుంది.

అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం…రేపు (15-10-2026) కోస్తాంధ్ర, యానాంలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. రాయలసీమతో సహా ఇతర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ (గరిష్ఠంగా 60 కి.మీ) వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అక్టోబర్ 16 నుంచి 18వ తేదీ వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో గాలుల వేగం గంటకు 40-50 కి.మీ (గరిష్ఠంగా 60 కి.మీ) వరకు ఉండవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More