AP Road Accidents : ఏపీలో వేర్వేరు బైక్ ప్రమాదాలు.. ఐదుగురు మృతి

AP Road Accident : ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతిచెందారు.

Published on: Apr 3, 2026, 12:34:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలో జరిగిన వేర్వేరు ద్విచక్రవాహన ప్రమాదాల్లో ఐదుగురు మరణించారు. అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ ప్రమాదాలు జరిగాయి. మైనర్లు, యువకులు ఈ ఘటనల్లో మృతిచెందారు.

రోడ్డు ప్రమాదాలు
రోడ్డు ప్రమాదాలు

అనకాపల్లి జిల్లాలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం జంక్షన్ వద్ద రాత్రి 12 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దారుణంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరిని అనకాపల్లికి తరలిస్తుండగా మార్గ మధ్యలో పరిస్థితి విషమించి చనిపోడు. ముగ్గురు యువకులు కూడా ఎలమంచిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.

మృతులు బంగారు నాని, గోవింద్, దుర్గాప్రసాద్‌. మృతుల్లో ఇద్దరు పెయింటింగ్ పనులు చేసుకుంటారు. మరో యువకుడు చదువుకుంటున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రూరల్ మండలం లక్ష్మీపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ మీద ఉన్న ఐదుగురు మైనర్లను గుర్తు తెలియని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్యాటరింగ్ పని కోసం మైనర్లు నూజివీడు వెళ్లి తిరిగివస్తున్నారు. ఈ సమయంలోనే ప్రమాదం జరిగింది.

పల్సర్ బైక్ మీద ఐదుగురు మైనర్లు ప్రయాణించినట్టుగా గుర్తించారు. లక్ష్మీపురం దగ్గరలో ఒక వ్యక్తిని ఇంటి వద్ద దింపడానికి ఎన్‌హెచ్ 216హెచ్ వద్ద బైక్ ఆపారు. ఆ వెంటనే లారీ ఢీకొట్టింది. రహదారి మీద ఉన్న వీరిని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఈశ్వర్(16), సన్నీ(17) అనే ఇద్దరు మైనర్లు అక్కడిక్కకడే చనిపోయారు. ఇద్దరి శరీరాలు దారుణంగా అయ్యాయి. చూసేందుకు భయంకరంగా పరిస్థితి ఉంది. మరో ముగ్గురు వెంకటేశ్వరరావు (16), రామ్‌చరణ్ (17), బాలమర్తి చరణ్ తేజ్(17)కు తీవ్రంగా గాయాలు అయ్యాయి. చరణ్ తేజ్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More