AP Schools Bandh : జులై 24న ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు, కాలేజీలు బంద్

AP Schools Bandh : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జులై 24వ తేదీన స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఈ మేరకు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

Published on: Jul 22, 2026, 15:09:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విద్యా రంగాన్ని కుదిపేస్తున్న నీట్(NEET) క్వశ్చన్ పేపర్ లీకేజీ ఉదంతం తీవ్ర వివాదానికి దారితీసింది. పరీక్షా నిర్వహణలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జులై 24న ఏపీ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

ఏపీలో స్కూళ్లు బంద్
ఏపీలో స్కూళ్లు బంద్

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును సమస్యల్లోకి నెట్టేసిన పేపర్ లీకేజీల సంస్కృతిని అరికట్టాలని ప్రధాన విద్యార్థి, యువజన సంఘాలు ధ్వజమెత్తాయి. ఈ క్రమంలో SFI, PDSU, AISA, NSUI, DYFI, AIYF వంటి ప్రధాన సంఘాల రాష్ట్ర కమిటీలు ఐక్యంగా పోరాటానికి సిద్ధమయ్యాయి. బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరాయి.

నీట్ పేపర్ లీకేజీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి స్వచ్ఛందంగా తప్పుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. భవిష్యత్తులో లీకేజీలు జరగకుండా అత్యంత పారదర్శకమైన పరీక్షా విధానాన్ని తీసుకురావాలని పేర్కొన్నాయి. లీకేజీల వెనుక ఉన్న అసలు సూత్రధారులపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయాలి.

జులై 24న జరిగే బంద్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కాలేజీలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యాలు భాగస్వాములై విజయవంతం చేయాలని సంఘాలు కోరాయి.

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో 'కాక్రోచ్ జనతా పార్టీ' నిరసన కొనసాగుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వైఫల్యాన్ని ఎండగడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు ప్రాంతాల్లో వినూత్న నిరసన ప్రదర్శనలు చేపట్టారు. విద్యా వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని ఏరిపారేయాలని, విద్యార్థుల కష్టాన్ని బ్రోకర్లకు విక్రయించే వ్యవస్థను బూడిద చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

నీట్ పరీక్ష పేపర్ లీక్, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన నిరసనలు మంగళవారం తీవ్రరూపం దాల్చాయి. విద్యార్థులపై అణచివేతకు నిరసనగా ప్రతిపక్షాలు వీధుల నుంచి పార్లమెంట్ వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించాయి. మంగళవారం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా, అఖిలేష్ యాదవ్ సహా పలువురు నాయకులు ప్రధానమంత్రి నివాసం బయట ధర్నా నిర్వహించారు. పోలీసులు అఖిలేష్, ప్రియాంక, రాహుల్‌తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, కొద్దిసేపటికే వారిని విడుదల చేశారు.

ఇదిలా ఉండగా సీజేపీ ప్రతినిధి బృందానికి, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు మధ్య జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగియగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నిరసనలు కొనసాగుతాయని సీజేపీ జనతా పార్టీ ప్రకటించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More