రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. పోటీ లేకుండానే ముగిసిన ఏకగ్రీవ ఫలితాల వివరాలను కూడా అందులో స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28 జిల్లాల పరిధిలోని 9,829 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు నోటిఫికేషన్ రాగా, అందులో 1,985 స్థానాలు ఏకగ్రీవంగా ముగిశాయి. శాతాల పరంగా చూస్తే మొత్తం ఎంపీటీసీ స్థానాల్లో 20.20 శాతం ఏకగ్రీవమయ్యాయి.

అదే విధంగా 659 జడ్పీటీసీ స్థానాలకు గానూ 77 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది మొత్తం జడ్పీటీసీ స్థానాల్లో 11.7 శాతానికి సమానం.
ఎంపీటీసీ ఏకగ్రీవాలు ఎక్కువగా ఉన్న జిల్లాలు చూసుకుంటే.. పల్నాడు: 382, కడప: 358, మార్కాపురం: 217, అన్నమయ్య: 169, ప్రకాశం: 153 ఉన్నాయి.
జడ్పీటీసీ ఏకగ్రీవాల్లో ముందంజలో ఉన్న జిల్లాలు చూస్తే.. కడప: 23, పల్నాడు: 18, నంద్యాల: 8, మార్కాపురం: 6 ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో నమోదైన ఏకగ్రీవాల పూర్తి సమాచారాన్ని కూడా ఎస్‌ఈసీ తన సమగ్ర నివేదికలో పొందుపరిచింది.
ఏకగ్రీవాలు పోను, మిగిలిన 7,844 ఎంపీటీసీ స్థానాలకు, 582 జడ్పీటీసీ స్థానాలకు వచ్చే నెల 5వ తేదీన పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలోనే పోటీ పడుతున్నారు.
ఎంపీటీసీ పోరులో 7,844 స్థానాలకు 18,952 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వైసీపీ: 7,632, టీడీపీ: 6,423, స్వతంత్రులు: 2,239, జనసేన: 1,521, కాంగ్రెస్: 326, బీజేపీ: 285, సీపీఎం: 259, బీఎస్పీ: 133, ఇతర పార్టీలు: 131, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP): 3 బరిలో ఉన్నారు.
ఇక జడ్పీటీసీ 582 స్థానాలకు పోరులో 2,169 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసీపీ: 574, స్వతంత్రులు: 503, టీడీపీ: 452, కాంగ్రెస్: 270, జనసేన: 109, బీఎస్పీ: 107, ఇతర పార్టీలు: 64, సీపీఎం: 47, బీజేపీ: 34, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP): 9 మంది ఉన్నారు. రాబోయే ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు ఎస్‌ఈసీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
{{/usCountry}}ఇక జడ్పీటీసీ 582 స్థానాలకు పోరులో 2,169 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసీపీ: 574, స్వతంత్రులు: 503, టీడీపీ: 452, కాంగ్రెస్: 270, జనసేన: 109, బీఎస్పీ: 107, ఇతర పార్టీలు: 64, సీపీఎం: 47, బీజేపీ: 34, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP): 9 మంది ఉన్నారు. రాబోయే ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు ఎస్‌ఈసీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
{{/usCountry}}ఆసక్తికర విషయం ఏంటంటే.. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం అయిన పులివెందులలో 7 జడ్పీటీసీ స్థానాలకు గానూ టీడీపీ 3 ఏకగ్రీవం చేసుకుంది. సింహాద్రిపురం, చక్రాయపేట, తొండూరు టీడీపీ సొంతమయ్యాయి.